- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Tatkal Ticketing: ఇకపై రిజర్వేషన్ కౌంటర్లలో తత్కాల్ టిక్కెట్లకు ఓటీపీ తప్పనిసరి
తత్కాల్ టికెట్ బుకింగ్‌లో జరిగే దుర్వినియోగాన్ని అరికట్టే లక్ష్యంలో భాగంగా ఈ నిబంధన అమలు

దిశ, బిజినెస్ బ్యూరో: తత్కాల్ టికెట్లకు సంబంధించి రైల్వే శాఖ బుధవారం మరో కీలక మార్పును తీసుకొచ్చింది. రిజర్వేషన్ కౌంటర్ల వద్ద తీసుకునే తత్కాల్ టికెట్లకు వన్‌టైమ్ పాస్‌వర్డ్ (ఓటీపీ) తప్పనిసరి ఇవ్వాల్సి ఉంటుంది. చివరి నిమిషంలో తత్కాల్ టికెట్ బుకింగ్‌లో జరిగే దుర్వినియోగాన్ని అరికట్టే లక్ష్యంలో భాగంగా ఈ నిబంధనను అమలు చేస్తున్నట్టు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. రైల్వే మంత్రిత్వ శాఖ నవంబర్ 17న పైలట్ ప్రాజెక్ట్ రూపంలో రిజర్వేషన్ కౌంటర్ల నుంచి బుక్ చేసుకున్న ప్రయాణాలకు ఓటీపీ-ఆధారిత తత్కాల్ టికెటింగ్ వ్యవస్థను ప్రారంభించింది. ఇది కొన్ని రైళ్లతో ప్రారంభమైంది, త్వరలో ఈ సంఖ్యను 52కి పెంచారు. రానున్న రోజుల్లో అన్ని రిజర్వేషన్ కౌంటర్లలో ఈ వ్యవస్థను అన్ని రైళ్లకు అమలు చేయనున్నట్టు మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ మార్పుతో ఇకపై సాధారణ వినియోగదారులకు చివరి రిజర్వేషన్ కౌంటర్ల వద్ద ఫామ్ నింపిన తర్వాత మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేస్తేనే టికెట్ బుక్ అవుతుంది. ఇటీవల రైల్వే మంత్రిత్వ శాఖ రైలు టికెట్లకు సంబంధించి కీలక చర్యలు తీసుకుంటోంది. టికెట్ల బుకింగ్‌లో అక్రమాలను నిలువరించేందుకు కొన్ని మార్పులు చేస్తోంది. ఈ ఏడాది జూలైలోనే ఆన్‌లైన్ తత్కాల్ టికెట్ బుకింగ్ కోసం ఆధార్ ఓటీపీ వెరిఫికేషన్ విధానాన్ని అమలు చేసింది. అక్టోబర్‌లోనూ సాధారణ టికెట్ల బుకింగ్ సమయానికి 15 నిమిషాల ముందు ఆధార్ ఉన్న వాళ్లకే అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.






