Oracle: 20,000-30,000 ఉద్యోగాల కోతను ప్లాన్ చేస్తున్న ఒరాకిల్

by S Gopi |

అత్యంత వేగంగా పెరుగుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) మౌలిక సదుపాయాల నిధుల ఏర్పాటు కోసం ఏకంగా 20 వేల నుంచి 30 వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం.

Oracle: 20,000-30,000 ఉద్యోగాల కోతను ప్లాన్ చేస్తున్న ఒరాకిల్
X

దిశ, బిజినెస్ బ్యూరో: టెక్ ప్రపంచంలో ఉద్యోగుల తొలగింపులు కొనసాగుతున్నాయి. ఇటీవల ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ భారీ సంఖ్యలో లేఆఫ్స్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా యూఎస్ టెక్ దిగ్గజం ఒరాకిల్ కూడా భారీ సంఖ్యలో ఉద్యోగులను ఇంటికి సాగనంపేందుకు సిద్ధమవుతోంది. అత్యంత వేగంగా పెరుగుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) మౌలిక సదుపాయాల నిధుల ఏర్పాటు కోసం ఏకంగా 20 వేల నుంచి 30 వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఈ నిర్ణయం ద్వారా పెద్ద ఎత్తున ఖర్చులను తగ్గించాలని కంపెనీ భావిస్తోంది. ముఖ్యంగా ఒరాకిల్ తన ఏఐ డేటా సెంటర్ ప్రణాళికలతో పాటు ఏఐ మౌలిక సదుపాయాలు, క్లౌడ్ కంప్యూటింగ్ విభాగాల్లో పోటీ పడేందుకు ఎక్కువ నిధులను కేటాయించాలని నిర్ణయించింది. దీనికోసం కంపెనీపై పడుతున్న ఆర్థిక ఒత్తిడిని తగ్గించే క్రమంలో ఈ భారీ లేఆఫ్స్‌కు సిద్ధమైనట్టు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. పలు నివేదికల ప్రకారం, దీర్ఘకాలానికి క్లౌడ్ మౌలిక సదుపాయాల కోసం నిధుల ఒత్తిడిని తగ్గించేందుకు తొలగింపుల నిర్ణయం తీసుకుంటోంది. ముఖ్యంగా వచ్చే కొన్నేళ్ల పాటు ఏఐ-రెడీ డేటా సెంటర్ల వంటి భవిష్యత్తు టెక్నాలజీ కోసం సిద్ధంగా ఉండేందుకు అవసరమైనంత మేర మూలధన నిధులను సిద్ధం చేసుకునే ప్రక్రియలో భాగంగా ఒరాకిల్ లేఆఫ్స్ దిశగా వెళ్తున్నట్టు పేర్కొన్నాయి.

Next Story