- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Operation Sidoor: దేశంలో 200కి పైగా విమానాల రద్దు
ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పైస్‌జెట్, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, అకాసా ఎయిర్ విమానాశ్రయాలను, సేవలను రద్దు చేశాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: పెహల్‌గామ్ దాడికి ప్రతీకారంగా బుధవారం తెల్లవారుజామున పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై భారత సైన్యం దాడులు నిర్వహించిన తర్వాత విధించిన వైమానిక ఆంక్షల కారణంగా దేశంలోని 200కి పైగా విమానాలు రద్దు చేశారు. కనీసం 18 విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేశారు. ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పైస్‌జెట్, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, అకాసా ఎయిర్ సహా మరికొన్ని విదేశీ విమానయాన సంస్థలు విమానాశ్రయాలను, సేవలను రద్దు చేశాయి. ప్రధానంగా మూతబడిన వాటిలో ఉత్తర, పశ్చిమ భారతంలోని శ్రీనగర్, లేహ్, జమ్మూ, అమృత్సర్, పఠాన్‌కోట్, చండీగఢ్, జోధ్‌పూర్, జైసల్మేర్, సిమ్లా, ధర్మశాల, జామ్‌నగర్ విమానాశ్రయాలు ఉన్నాయని జాతీయ మీడియా వెల్లడించింది.
ఇండిగో మాత్రమే 165కి పైగా విమానాలను రద్దు చేసినట్టు అధికారికంగా ప్రకటించింది. మే 10 వరకు ఈ విమానాలు రద్దవుతాయని పేర్కొంది. ఇండిగో ప్రస్తుతం రోజుకు సుమారు 2,200 విమానాలను నడుపుతోంది. ప్రస్తుత పరిస్థితి నేపథ్యంలో.. శ్రీనగర్, జమ్మూ, అమృత్‌సర్, లేహ్, చండీగఢ్, ధర్మశాల, బికనీర్, జోధ్‌పూర్‌లకు వెళ్లే విమానాలను రద్దు చేసినట్టు ఇండిగో తెలిపింది. దీనివల్ల ప్రభావితమైన ప్రయాణీకులు తర్వాత అందుబాటులో ఉన్న తమ విమానాలను తిరిగి షెడ్యూల్ చేసుకునే లేదా ఎటువంటి అదనపు ఛార్జీలు లేకుండా వారి బుకింగ్‌లను రద్దు చేసుకునే అవకాశం ఉందని ఇండిగో వివరించింది. పూర్తి వాపసు ఇవ్వనున్నట్టు స్పష్టం చేసింది. ఇదే సమయంలో ఎయిర్ ఇండియా తొమ్మిది విమానాశ్రయాలకు సేవలను నిలిపివేసింది. వాటిలో జమ్మూ, శ్రీనగర్, లేహ్, జోధ్‌పూర్, అమృత్‌సర్, భుజ్, జామ్‌నగర్, చండీగఢ్, రాజ్‌కోట్‌లకు వెళ్లే విమానాలను నిలిపివేసింది. రీషెడ్యూలింగ్ ఛార్జీలపై ఒకేసారి మినహాయింపు లేదా రద్దు చేసుకుంటే పూర్తి వాపసు ఇవ్వనున్నట్టు ఎక్స్‌లో ట్వీట్‌లో పేర్కొంది.
అంతర్జాతీయ విమానాల దారి మళ్లింపు
పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య, అంతర్జాతీయ ఎయిర్‌లైన్ సంస్థలు పాకిస్తాన్ వైమానిక ప్రాంతాన్ని నివారించడానికి డజన్ల కొద్దీ విమానాలను దారి మళ్లించాయి. కొన్నిటినీ రద్దు చేశాయి. ఫ్లైట్‌రాడార్24 డేటా ప్రకారం, బుధవారం ఉదయం నాటికి పాకిస్తాన్‌కు లేదా పాకిస్తాన్ నుంచి బయలుదేరే కనీసం 52 విమానాలు రద్దు అయ్యాయి. తైవాన్‌కు చెందిన ఈవీఏ యూరప్‌కు వెళ్లే విమానాలను దారి మళ్లించగా, కొరియన్ ఎయిర్, థాయ్‌లాండ్ ఎయిర్‌వేస్, వియత్నాం, చైనా ఎయిర్‌లైన్స్ లండన్, ఫ్రాంక్‌ఫర్ట్, రోమ్‌లకు విమాన సర్వీసులను మళ్లించింది.






