OpenAI: రూ. 5 కోట్ల జీతంతో కొత్త ఉద్యోగాన్ని ఆఫర్ చేసిన ఓపెన్‌ఏఐ సీఈఓ ఆల్ట్‌మన్

by S Gopi |

దీనికి అదనంగా కంపెనీలు షేర్లు కూడా లభిస్తాయని వెల్లడించారు.

OpenAI: రూ. 5 కోట్ల జీతంతో కొత్త ఉద్యోగాన్ని ఆఫర్ చేసిన ఓపెన్‌ఏఐ సీఈఓ ఆల్ట్‌మన్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) కంపెనీ ఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ భారీ ఆఫర్ ప్రకటించారు. తన కంపెనీలో 'హెడ్ ఆఫ్ ప్రిపేర్‌డ్‌నెస్' అనే పేరుతో కొత్త సీనియర్ ఉద్యోగానికి ఏకంగా 5,55,000 డాలర్ల(మన కరెన్సీలో అక్షరాల రూ. 4.98 కోట్ల) జీతాన్ని ఆల్ట్‌మన్ ఇస్తానని చెప్పారు. దీనికి అదనంగా కంపెనీలు షేర్లు కూడా లభిస్తాయని వెల్లడించారు. చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏఐ కారణంగా ఎదురయ్యే నష్టాలను తగ్గించడం ఈ ఉద్యోగం ప్రధాన లక్ష్యం. ప్రస్తుతం ఏఐ వ్యవస్థలు అత్యంత వేగంగా అప్‌గ్రేడ్ అవుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోకపోతే తీవ్రమైన ప్రతికూల ప్రభావాలను ఎదుర్కొనక తప్పదని, కాబట్టి ఈ ఉద్యోగం అత్యంత ముఖ్యమైన, సవాలుతో కూడిన పని అని ఆల్ట్‌మన్ వివరించారు.

ఏఐ మోడల్స్ వల్ల ఇప్పుడు ప్రయోజనాలే కాకుండా వాస్తవ ప్రపంచంలో సమస్యలను కూడా సృష్టించేందుకు శక్తివంతంగా మారుతున్నాయి. 2025లో ఏఐ ప్రజల మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందనే సంకేతాలి కనిపించాయి. కంప్యూటర్ భద్రత విషయంలో ఏఐ టూల్స్ బలపడుతున్నాయి, ఇవి వ్యవస్థలోని బలహీనతలను కనిపెట్టగలిగే స్థాయికి చేరుకున్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో ఏఐ దుర్వినియోగంపై లోతుగా అధ్యయనం చేయగలిగిన, రాబోయే నష్టాలను నివారించడంలో సహాయపడే ఉద్యోగి కావాలని ఓపెన్ఏఐ ఆశిస్తోందని శామ్ ఆల్ట్‌మన్ పేర్కొన్నారు. ప్రిపేర్డ్‌నెస్ హెడ్ ఏఐని పనికొచ్చేలా చూస్తారు. వ్యవస్థలను రక్షించడానికి ఏఐని ఉపయోగించడంలో సైబర్ సెక్యూరిటీ నిపుణులకు సహాయం చేయడం, సైబర్ నేరగాళ్లు ఇతరులపై దాడి చేయడానికి టూల్స్‌ను వాడకుండా ఆపడం ఈ ఉద్యోగ బాధ్యత. ఇప్పటివరకు ఇటువంటి ఉద్యోగం లేనందున ఈ పని కష్టమని శామ్ ఆల్ట్‌మన్ వెల్లడించారు.

Next Story