- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
OpenAI: తల్లిదండ్రుల చేతుల్లో 'చాట్‌జీపీటీ నియంత్రణ' సదుపాయం తీసుకొచ్చిన ఓపెన్ఏఐ
తల్లిదండ్రులు, టీనేజర్లు తమ అకౌంట్లను లింక్ చేసుకోవచ్చు, తద్వారా మరింత రక్షణ పొందవచ్చు.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ కృత్రిమ మేధ(ఏఐ) చాట్‌బాట్ చాట్‌జీపీటీలో కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చినట్టు దాని మాతృసంస్థ ఓపెన్ఏఐ సోమవారం ప్రకటనలో వెల్లడించింది. ముఖ్యంగా చాట్‌జీపీటీకి సంబంధించి తల్లిదండ్రుల చేతుల్లో నియంత్రణ ఉండేలా 'పేరెంటల్ కంట్రోల్స్'ను ప్రారంభిస్తున్నట్టు తెలిపింది. దీని ద్వారా తల్లిదండ్రులు ఇప్పుడు తమ పిల్లల అకౌంట్లతో తమ అకౌంట్లను అనుసంధానం చేసుకోవచ్చు, దానివల్ల వారు పిల్లల భద్రతను మెరుగుపరుచుకోవచ్చని, పరిమితి విధించవచ్చని ఓపెన్ఏఐ పేర్కొంది. తల్లిదండ్రులు, టీనేజర్లు తమ అకౌంట్లను లింక్ చేసుకోవచ్చు, తద్వారా మరింత రక్షణ పొందవచ్చు. అంతేకాకుండా తల్లిదండ్రులకు అవసరమైన ఫీచర్లలో మార్పులు చేసుకునే సదుపాయం, పరిమితిని సెట్ చేసుకునే టూల్స్ కూడా ఉంటాయని ఓపెన్ఏఐ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో వివరించింది. ఈ కొత్త ఫీచర్ వెబ్‌తో పాటు మొబైల్ యాప్‌లో సోమవారం నుంచే అందుబాటులోకి వచ్చిందని స్పష్టం చేసింది. కాగా, ఓపెన్ఏఐ ఈ ఫీచర్ తీసుకురావడానికి ముందు ఓ టీనేజ్ పిల్లవాడి ఆత్మహత్యకు చాట్‌జీపీటీ కారణమని ఆరోపిస్తూ కాలిఫోర్నియాకు చెందిన ఓ జంట దావా వేసింది. ఈ కారణంగానే పేరెంటల్ కంట్రోల్‌ను తీసుకొచ్చినట్టు తెలుస్తోంది.
'పేరెంటల్ కంట్రోల్ ' ఎలా పని చేస్తుంది?
* చాట్‌జీపీటీలో అకౌంట్‌ను లింక్ చేయడానికి, తల్లిదండ్రులు లేదా టీనేజర్ అందుకోసం ఇన్విటేషన్ పంపవచ్చు.
* ఎవరైనా టీనేజర్ వారి ఖాతాను డిస్‌కనెక్ట్ చేస్తే తల్లిదండ్రులకు తెలుస్తుంది.
* 'సీరియస్ సేఫ్టీ రిస్క్' సందర్భాల్లో తల్లిదండ్రులకు నోటిఫికేషన్ అందుతుంది.
ఇదే సమయంలో ఏదైనా తీవ్రమైన సేఫ్టీ రిస్క్ సందరభాల్లో తప్ప, తల్లిదండ్రులు తమ టీనేజర్ చాటింగ్ వివరాలను తెలుసుకునే అవకాశం ఉండదని ఓపెన్ఏఐ స్పష్టం చేసింది. అటువంటి సందర్భాలలో, తల్లిదండ్రులకు నోటిఫికేషన్ అందుతుంది. కానీ టీనేజర్ సేఫ్టీకి మద్దతిచ్చే సమాచారంతో మాత్రమే తల్లిదండ్రులకు వారి పిల్లల చాటింగ్ చూసే వీలుంటుంది.






