Women Investment: పెట్టుబడుల్లో మహిళల దూకుడు

by S Gopi |

కేవలం 40 శాతం మంది మాత్రమే ఫిక్స్‌డ్ డిపాజిట్లు, బంగారం కాకుండా ఇతర మార్గాల్లో పెట్టుబడి పెడుతున్నారు

Women Investment: పెట్టుబడుల్లో మహిళల దూకుడు
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారతీయ మహిళలు గతంలో కంటే ఎక్కువగా పొదుపు చేస్తున్నారు, కానీ పెట్టుబడి విషయంలో ఇప్పటికీ చాలామంది సురక్షితమైన మార్గాలనే ఎంచుకుంటున్నారని ఓ కొత్త అధ్యయనం తెలిపింది. ఎక్కువ సంఖ్యలో మహిళలు ప్రతి నెలా డబ్బును పొదుపు చేస్తున్నప్పటికీ, దీర్ఘకాలిక సంపదను సృష్టించుకోవడానికి అవసరమైన అడుగులు వేస్తున్న వారి సంఖ్య తక్కువగానే ఉంది. ది వెల్త్ కంపెనీ మ్యూచువల్ ఫండ్ నివేదిక ప్రకారం, దాదాపు 70 శాతం మంది భారతీయ మహిళలు ప్రతి నెలా చురుకుగా పొదుపు చేస్తున్నారు. అయితే, కేవలం 40 శాతం మంది మాత్రమే ఫిక్స్‌డ్ డిపాజిట్లు, బంగారం కాకుండా ఇతర మార్గాల్లో పెట్టుబడి పెడుతున్నారు. అదేవిధంగా సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌ల (సిప్‌లు) ద్వారా పెట్టుబడి పెట్టే మహిళల్లో దాదాపు సగం మంది 30 ఏళ్లలోపు వారే. ఇది, మహిళలు మార్కెట్‌తో ముడిపడిన పెట్టుబడుల పట్ల ఎక్కువ ఆసక్తి చూపిస్తున్న సంకేతాలిస్తుందని నివేదిక అభిప్రాయపడింది. ఈ ధోరణి పెరుగుతున్న ఆర్థిక స్వాతంత్ర్యాన్ని, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లకు మెరుగైన యాక్సెస్‌ను ప్రతిబింబిస్తుంది.

చిన్న నగరాల నుంచే ఎక్కువ

మెట్రోయేతర ప్రాంతాల్లోని మహిళలు పెట్టుబడులకు ఎక్కువ ఆసక్తి చూపిస్తుండటం ఆసక్తికరంగా ఉందని నివేదిక తెలిపింది. చిన్న నగరాల నుంచి మహిళా పెట్టుబడిదారుల సంఖ్య ఏటా 2.5 రెట్లకు పైగా పెరిగింది. అన్ని వయసుల మహిళల్లోనూ మ్యూచువల్ ఫండ్స్ పట్ల ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఇదే సమయంలో చాలా మంది మహిళలు ఇప్పటికీ పెట్టుబడి నిర్ణయాల కోసం కుటుంబ సభ్యులపై ఆధారపడుతున్నారు. తరచుగా తమ ఆదాయంలో కొంత భాగాన్ని మాత్రమే మార్కెట్-లింక్డ్ ఉత్పత్తులకు కేటాయిస్తున్నారని నివేదిక పేర్కొంది.

Next Story