- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
RBI: ఆన్‌లైన్ మోసాల బాధితులకు రూ. 25,000 పరిహారం
వినియోగదారుల రక్షణ, డిజిటల్ చెల్లింపుల భద్రతను పెంచడానికి ఆర్‌బీఐ తీసుకున్న అనేక చర్యల్లో ఇది భాగం.

దిశ, బిజినెస్ బ్యూరో: ఈసారి ద్రవ్య పరపతి విధాన కమిటీ(ఎంపీసీ) సమావేశంలో ఆర్‌బీఐ కీలక ప్రతిపాదన చేసింది. చిన్న మొత్తంలో జరిగే మోసపూరిత లావాదేవీలలో నష్టపోయిన వినియోగదారులకు రూ. 25,000 వరకు పరిహారం అందించడానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) ప్రత్యేక ఫ్రేమ్‌వర్క్‌ను ప్రతిపాదిస్తుందని గవర్నర్ సంజయ్ మల్హోత్రా శుక్రవారం తెలిపారు. వినియోగదారుల రక్షణ, డిజిటల్ చెల్లింపుల భద్రతను పెంచడానికి ఆర్‌బీఐ తీసుకున్న అనేక చర్యల్లో ఇది భాగం. దీనికి సంబంధించి మార్గదర్శకాలను త్వరలో జారీ చేస్తామని గవర్నర్ స్పష్టం చేశారు.
* ఈ పరిహార ప్రయోజనం జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే వస్తుందని, ప్రతి సంవత్సరం కాదు. వినియోగదారులు అప్రమత్తంగా ఉండటానికి, పదే పదే తప్పులు చేయకుండా నిలువరించడానికే ఈ పరిమితిని నిర్ణయించారు.
* గరిష్ట పరిహారం రూ. 25,000 ఇస్తారు.
* చెల్లించాల్సిన మొత్తం నష్టంలో 85 శాతం లేదా రూ. 25,000, ఈ రెండింటిలో ఏది తక్కువ అయితే అదిగా లెక్కిస్తారు. ఉదాహరణకు నష్టం రూ. 50,000 అయితే, 85% అంటే రూ. 42,500 అవుతుంది. కానీ ఆర్‌బీఐ రూ. 25,000 మాత్రమే చెల్లిస్తుంది. అదే, నష్టం రూ. 20,000 అయితే, 85 శాతం అంటే రూ. 17,000, కాబట్టి పరిహారం రూ. 17,000 ఇస్తారు.
ఆర్‌బీఐ డేటా ప్రకారం, 2023-24 ఆర్థిక సంవత్సరంలో 29,080 మోసాలు, రూ. 1,457 కోట్ల నష్టాలు నమోదయ్యాయి. ఆ తర్వాత 2024-25 ఆర్థిక సంవత్సరంలో కార్డ్, ఇంటర్నెట్ ఆధారిత లావాదేవీలకు సంబంధించిన 13,469 మోసాల కేసులు నమోదయ్యాయని, వీటి వల్ల రూ. 520 కోట్ల నష్టం వాటిల్లిందని బ్యాంకులు నివేదించాయి.
అలాగే, బ్యాంకులు కస్టమర్లకు అవసరంలేని, పూర్తి సమాచారం ఇవ్వకుండా రుణాలివ్వడం, రుణాల రికవరీ, అప్పులను వసూలు చేయడానికి ఏజెంట్ల వినియోగంపై మార్గదర్శకాలను జారీ చేస్తామని ఆర్‌బీఐ పేర్కొంది.






