యూజర్లకు షాకివ్వనున్న స్విగ్గీ, జొమాటో.. ఇక బాదుడే

by Naga Rani Yarlagadda |

ఇప్పటికే స్విగ్గీ (Swiggy), జొమాటో (Zomato), మ్యాజిక్ పిన్ (Magic Pin) వంటి ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ డెలివరీ ఛార్జీలను పెంచాయి. ఇది చాలదన్నట్లు ..

యూజర్లకు షాకివ్వనున్న స్విగ్గీ, జొమాటో.. ఇక బాదుడే
X

దిశ, వెబ్‌డెస్క్: వీక్ డేస్, వీకెండ్ తో సంబంధం లేకుండా.. వారాలతో పనిలేకుండా.. వెజ్ అండ్ నాన్ వెజ్.. కావాల్సిన వంటకం ఏదైనా సరే ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ లో ఆర్డర్ చేసుకుని తినడం అలవాటుగా మారింది. సోమవారం నుంచి శుక్రవారం వరకూ ఆఫీస్ వర్క్స్ లో బిజీగా ఉండి వంటలు చేయలేక, చేసుకోలేక.. శని, ఆదివారాల్లో రెస్ట్, వీకెండ్ అవుటింగ్ పేరుతో వారం మొత్తం బయటి ఫుడ్ పైనే ఆధారపడేవారు, పడుతున్నవారు కోకొల్లలు. అయితే ఇప్పటికే స్విగ్గీ (Swiggy), జొమాటో (Zomato), మ్యాజిక్ పిన్ (Magic Pin) వంటి ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ డెలివరీ ఛార్జీలను పెంచాయి. ఇది చాలదన్నట్లు సెప్టెంబర్ 22 నుంచి డెలివరీ ఛార్జీలపై 18 శాతం జీఎస్టీ అమల్లోకి రానుంది. దీంతో డెలివరీ ఛార్జీలు మరింత పెరగనున్నాయి.

2022 జనవరి నుంచి ఆన్లైన్లో ఆర్డర్ చేసే ఫుడ్ పై 5 శాతం జీఎస్టీ వసూలు చేస్తుండగా.. సెప్టెంబర్ 22 నుంచి డెలివరీ ఛార్జీపై 18 శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. అంటే డెలివరీ ఛార్జీ రూ.10 ఉంటే.. జీఎస్టీతో కలిపి మరో ఐదారు రూపాయలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. తరచూ ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ చేసే వినియోగదారుడి జేబుకు ఇక చిల్లు పడటం ఖాయమనమాట.

Next Story