Oppo: విలీనం కానున్న వన్‌ప్లస్, రియల్‌మీ

by S Gopi |

ప్యనర్‌వ్యవస్థీకరణలో భాగంగా తీసుకున్న నిర్ణయమని, రెండు బ్రాండ్లను ఒప్పో సబ్-బ్రాండ్‌గా ఉంటాయని పలు నివేదికలు వెల్లడించాయి.

Oppo: విలీనం కానున్న వన్‌ప్లస్, రియల్‌మీ
X

దిశ, బిజినెస్ బ్యూరో: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు వన్‌ప్లస్, రియల్‌మీ త్వరలో విలీనం కానున్నాయి. తాజాగా నివేదికల ప్రకారం, వన్‌ప్లస్ కంపెనీ తన కార్యకలాపాలను రియల్‌మీలో కలపాలని భావిస్తోంది. ప్యనర్‌వ్యవస్థీకరణలో భాగంగా తీసుకున్న నిర్ణయమని, రెండు బ్రాండ్లను ఒప్పో సబ్-బ్రాండ్‌గా ఉంటాయని పలు నివేదికలు వెల్లడించాయి. ఈ విలీనం తర్వాత రెండు కంపెనీల మార్కెటింగ్, ఆఫ్టర్-సేల్స్ సర్వీసెస్ విభాగాలను సంయుక్తంగా నిర్వహించేలా మార్పులు చేయనున్నారు. విలీనానికి ప్రధానంగా ఇరు కంపెనీల వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడం, ఖర్చులను తగ్గించడంతో పాటు గ్లోబల్ మార్కెట్లపై దృష్టి సారించనున్నాయి. ఈ విలీనం వల్ల భారత్‌ మార్కెట్లో వన్‌ప్లస్ అమ్మకాలకు, కార్యకలాపాలకు ఎలాంటి ప్రమాదం లేదని, ఇప్పుడున్న తరహాలోనే యథాతథంగా కొనసాగుతాయని స్పష్టం చేసింది. స్మార్ట్‌ఫోన్, ఇతర ఉత్పత్తులకు సంబంధించి పాత పేర్లతోనే ఫోన్ల అమ్మకాలు కొనసాగుతాయని రెండు కంపెనీలు స్పష్టం చేశాయని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి.

Next Story