- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
GOLD RATES: మరోసారి భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
బంగారం కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్. మరోసారి ధరలు దిగొచ్చాయి.

దిశ, వెబ్ డెస్క్: బంగారం (Gold) కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్. మరోసారి ధరలు దిగొచ్చాయి. సాధారణంగా బంగారం, వెండి ధరలు (Gold, Silver rates) మార్కెట్ ఒడిదుడుకులపై ఆధారపడి ఉంటాయి. అయితే గత కొన్ని రోజులుగా అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో పసిడి ధరలు రికార్డు స్థాయిలో పెరిగిన సంగతి తెలిసిందే. అయితే, గత మూడు రోజులుగా బంగారం ధరలు నేల చూపులు చూస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాములు స్వచ్ఛమైన పసిడి ధర రూ. శుక్రవారం (ఫిబ్రవరి 28) నాటికి రూ.500 మేర క్షీణించి రూ.87,700కు చేరింది. అంతకు ముందు రోజు (గురువారం) ట్రేడింగ్ సెషన్‌లో ఈ మొత్తం రూ.88,200గా ఉంది. అంతర్జాతీయ స్పాట్ మార్కెట్‌లో ఔన్సు బంగారం 2862 డాలర్ల స్థాయి వద్ద ట్రేడవుతోంది.
నగల వ్యాపారుల నుంచి డిమాండ్ తగ్గడం, స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో బంగారం ధర తగ్గుముఖం పట్టినట్లు మార్కెట్ నిపుణులు వెల్లడించారు. అలాగే, వెండి సైతం భారీగా తగ్గుముఖం. గురువారం కిలో వెండి రూ.98,500 ఉండగా రూ.2100 తగ్గి రూ.96,400కు చేరింది. కాగా, జనవరి 1 నాటికి 10 గ్రాముల పసిడి ధర రూ.79,390 గా ఉండగా.. రెండు నెలల వ్యవధిలో దాదాపు 10 శాతం మేర పెరిగి దాదాపు రూ.90 వేల (రూ.87,700) వరకు చేరుకోవటం గమనార్హం.






