Jio Independence Day Offer: అదిరిపొయే మూడు కొత్త ప్లాన్‌లు

by Harish |   (  Updated:2022-08-15 17:06:49  IST  )

దిశ, వెబ్‌డెస్క్: స్వాతంత్ర దినొత్సవాన్ని పురస్కరించుకుని టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో, వినియోగదారులకు అదిరిపొయే ఆఫర్‌‌లను తీసుకొచ్చింది..Latest Telugu News

Jio Independence Day Offer: అదిరిపొయే మూడు కొత్త ప్లాన్‌లు
X

దిశ, వెబ్‌డెస్క్: స్వాతంత్ర దినొత్సవాన్ని పురస్కరించుకుని టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో, వినియోగదారులకు అదిరిపొయే ఆఫర్‌‌లను తీసుకొచ్చింది. తన కస్టమర్ల కోసం మూడు రీఛార్జ్ ప్లాన్‌లను అందుబాటులోకి తెచ్చింది. మొదటిది రూ. 2,999 ప్లాన్, రెండవది రూ. 750 ప్లాన్‌, ఇంకొక ప్లాన్‌ను JioFiber కస్టమర్లకు అందిస్తుంది. MyJio యాప్‌, వెబ్‌సైట్‌లో వినియోగదారులు ఈ ఆఫర్లను పొందవచ్చు.

జియో 2 ఇన్ 1 రూ.750 ప్లాన్‌.

ఈ ప్లాన్ కింద వినియోగదారులకు రెండు రకాల ప్రయోజనాలు లభిస్తాయి. రూ. 750 ప్లాన్‌లో రెండు ప్లాన్స్ రూ. 749, రూ.1 ప్లాన్ ఉన్నాయి. 90 రోజుల వ్యాలిడిటీతో రూ. 749 ప్లాన్‌ ద్వారా రోజు 2జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100ఎస్ఎంఎస్‌లు వస్తాయి. ఇంకొక రూ.1 ప్లాన్ ద్వారా రోజుకు 100mb డేటా అదనంగా లభిస్తుంది. కానీ ఈ ప్లాన్ పొందాలంటే మొత్తం రూ. 750 తో రీఛార్జ్ చేయాలి.

జియో రూ. 2,999 ప్లాన్

365 రోజుల వ్యాలిడిటీతో రూ. 3,000 విలువైన అదనపు ప్రయోజనాలు లభిస్తాయి. రోజు 2.5GB డేటా, అపరిమిత కాలింగ్, డిస్నీ+ హాట్‌స్టార్ (మొబైల్ ఎడిషన్)కి 1 సంవత్సరం సభ్యత్వం లభిస్తుంది. స్వాతంత్ర దినోత్సవం 2022 ఆఫర్ కింద, ఈ ప్లాన్‌తో 75GB అదనపు డేటా, రూ. 750 విలువైన ఇక్సిగో కూపన్, రూ. 750 విలువైన నెట్‌మెడ్స్ కూపన్, రూ. 750 విలువైన అజియో కూపన్‌లు వస్తాయి.

Jio Fiber ఆఫర్

Jio Fiber కస్టమర్లు కొత్త కనెక్షన్‌ను ఆగస్టు 12 నుండి ఆగస్టు 16 మధ్య బుక్ చేసుకుంటే వారికి 15 రోజులు ఉచితంగా సర్వీస్‌ను అందిస్తోంది. రూ. 499, రూ. 599, రూ. 799 లేదా రూ. 899 ప్లాన్‌ల ద్వారా 6 లేదా 12 నెలల రీఛార్జ్ చేసుకునే వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. MyJio యాప్‌లో ఎంపిక చేసిన వినియోగదారులకు వోచర్‌లను కూడా అందిస్తోంది.

పెళ్లి తర్వాత ఆధార్ కార్డ్‌లో ఇంటిపేరును ఇలా మార్చుకొండి

ఎయిర్‌టెల్ వినియోగదారుల కోసం రెండు సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లు లాంచ్

Next Story