విమానంలో ఉచితంగా ప్రయాణించే ఛాన్స్.. Go First ఆశ్చర్యపోయే ఆఫర్

by Disha Web Desk 17 |
విమానంలో ఉచితంగా ప్రయాణించే ఛాన్స్.. Go First ఆశ్చర్యపోయే ఆఫర్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ విమానయాన సంస్థ గో ఫస్ట్(Go First) తన 17వ వార్షికోత్సవం సందర్భంగా అందరూ ఆశ్చర్యపోయే రీతిలో కొత్త ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఉచితంగా విమానంలో ప్రయాణించే ఆఫర్‌ను అందిస్తోంది. కానీ ఇది అందరికీ కాకుండా 17 ఏళ్ల వయసులో ఉన్న వారికి మాత్రమే. 17వ వార్షికోత్సవం కానుకగా ఈ ఆఫర్‌ 2022 డిసెంబర్ 1 నాటికి 17 ఏళ్లకు పైన 18 ఏళ్లకు లోపు వయస్సు ఉన్నవారికి వర్తిస్తుందని కంపెనీ పేర్కొంది. 2023 నవంబర్ 4న ప్రయాణం చేసే వారికి మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.


గోఫస్ట్ వెబ్‌సైట్‌ ద్వారా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. ఫ్లై ఫర్ ఫ్రీ వోచర్ జనరేట్ చేశాక ఈ ఆఫర్ వర్తిస్తుంది. గుర్తింపు కోసం ఆధార్ కార్డు/పాస్‌పోర్ట్ వంటి డాక్యుమెంట్‌ను సమర్పించాలి. ఈ ఆఫర్‌తో పాటు, స్పెషల్ ఆఫర్లు కూడా ఉన్నాయి. గోయింగ్ 17 అనే ప్రోమో కోడ్ ద్వారా టికెట్లపై 17 శాతం తగ్గింపు కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ 2023 నవంబర్ 4 వరకు ఉంది. కానీ ప్రయాణానికి 15 రోజుల ముందుగానే టికెట్ బుక్ చేసుకోవాలి.

Next Story

Most Viewed