Ola Cabs: జీరో కమీషన్ విధానాన్ని తీసుకొచ్చిన ఓలా

by S Gopi |

దేశవ్యాప్తంగా ఉండే అన్ని బైక్ ట్యాక్సీలు, ఆటో, క్యాబ్‌లకు ఈ పాలసీ వర్తిస్తుందని వెల్లడించింది.

Ola Cabs: జీరో కమీషన్ విధానాన్ని తీసుకొచ్చిన ఓలా
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ ఓలా కీలక ప్రకటన విడుదల చేసింది. దేశవ్యాప్తంగా జీరో కమీషన్ మోడల్‌ను ప్రవేశపెడుతున్నట్టు మంగళవారం ప్రకటనలో తెలిపింది. క్యాబ్ ఓనర్లు రైడ్ తర్వాత వచ్చిన మొత్తం నుంచి కంపెనీకి కమీషన్ చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. దీని ద్వారా 10 లక్షల మంది డ్రైవర్లు రైడ్ లేదా ఆదాయంతో సంబంధం లేకుండా తమ ఛార్జీల ఆదాయాన్ని పూర్తిగా తీసుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఉండే అన్ని బైక్ ట్యాక్సీలు, ఆటో, క్యాబ్‌లకు ఈ పాలసీ వర్తిస్తుందని వెల్లడించింది. జీరో కమీషన్ విధానం కారణంగా ఓలా యాప్ వాడుతున్నందుకు సాఫ్ట్‌వేర్ యాజ్ ఏ సర్వీస్ కింద కొంత ఫీజు మాత్రమే ఉంటుందని కంపెనీ వివరణ ఇచ్చింది. సున్నా కమీషన్ మోడల్ ద్వారా పాన్ ఇండియాలో రైడ్ వ్యాపారంలో కీలక మార్పును తీసుకొస్తుంది. కమీషన్‌లను తొలగించడం డ్రైవర్లకు ఇప్పటి కంటే ఎక్కువ యాజమాన్య హక్కు కల్పిస్తుందని ఓలా కన్స్యూమర్ ప్రతినిధి తెలిపారు. క్యాబ్ సేవల వ్యవస్థకు డ్రైవర్లే వెన్నెముక అని, వారు మరింత ఎక్కువ ఆదాయం పొందడానికి ఇది అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. జీరో కమీషన్ మోడల్ దశలవారీగా అందుబాటులోకి వస్తుందని, మొదట్లో ఆటోలకు, ఆ తర్వాత బైక్ ట్యాక్సీ, అనంతరం క్యాబ్‌లకు వర్తించనుందని కంపెనీ స్పష్టం చేసింది. ప్రయాణీకుల భద్రతకు కూడా కంపెనీ ప్రాధాన్యత ఇస్తుందని, డ్రైవర్ల గురించి వివరాలు, డ్రైవర్ బ్యాగ్రౌండ్, వాహన నాణ్యత, యాప్‌లో అత్యవసర ఫీచర్‌లతో సహా అన్ని కఠినమైన భద్రతా ప్రోటోకాల్స్ పనిచేస్తాయని కంపెనీ పేర్కొంది.

Next Story