2024 నాటికి 500 కిలోమీటర్లతో ఓలా కార్ల ఉత్పత్తి: భవిష్ అగర్వాల్!

by Disha Web Desk 22 |
2024 నాటికి 500 కిలోమీటర్లతో ఓలా కార్ల ఉత్పత్తి: భవిష్ అగర్వాల్!
X

న్యూఢిల్లీ: ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ దిగ్గజ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ 2024 నాటికి దేశీయంగా ఈవీ కార్లను ఉత్పత్తి చేయనున్నట్టు కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ భవిష్ అగర్వాల్ సోమవారం వెల్లడించారు. 500 కిలోమీటర్లు ప్రయాణించే ఎలక్ట్రిక్ కారును తీసుకురానున్నట్టు ఆయన పేర్కొన్నారు. భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఓ కార్యక్రమంలో మాట్లాడిన భవిష్ అగర్వాల్, భారత్‌లో ఇప్పటివరకు చేపట్టిన అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్ల తయారీ ప్రాజెక్ట్‌గా ఇది నిలుస్తుందని, అలాగే, తమిళనాడులో ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీ ఈవీ కార్ల తయారీ, సెల్ ప్లాట్‌తో ప్రపంచంలోనే అతిపెద్ద ఈవీ హబ్‌గా విస్తరిస్తుందని ఆయన వివరించారు.

ఈ ఫ్యూచర్ ఫ్యాక్టరీని భారత్‌లోని అతిపెద్ద ఆటో హబ్‌లలో ఒకటిగా మార్చనున్నాం. కొత్త సౌకర్యాలతో 100 ఎకరాలలో లిథియం అయాన్ సెల్ ప్లాంట్, 200 ఎకరాలలో ఈవీ కార్ల తయారీ ప్లాంట్, అదేవిధంగా ఈవీ స్కూటర్ల తయారీ ప్లాంట్ కోసం అదనంగా 40 ఎకరాలలో ఉత్పత్తి జరుగుతుందన్నారు. ఓలా స్కూటర్ ఫ్యాక్టరీ ఏడాదికి కోటి స్కూటర్లను ఉత్పత్తి చేయనున్నామని, ఓలా కార్ ఫ్యాక్టరీ ఏడాదికి 10 లక్షల కార్లను, ఓలా గిగా ఫ్యాక్టరీ ఏడాదికి 100 గిగావాట్ అవర్ సెల్స్‌ను ఉత్పత్తి చేస్తుందని భవిష్ అగర్వాల్ కంపెనీ భవిష్యత్తు ప్రణాళికను వెల్లడించారు.

Personal Loan తీసుకుంటున్నారా.. అయితే ఇది మీకోసమే ?


Next Story

Most Viewed