- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ola Electric: ఆఫ్టర్ సేల్ సర్వీసెస్‌పై దృష్టి సారించిన ఓలా ఎలక్ట్రిక్
ఇకపై ఓలా ఎలక్ట్రిక్ ఒరిజినల్ విడిభాగాలను ఓలా ఎలక్ట్రిక్ కస్టమర్ యాప్, వెబ్‌సైట్ ద్వారా నేరుగా కొనుగోలు చేయవచ్చు.

దిశ, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ ఆఫ్టర్ సేల్ సర్వీసెస్‌పై దృష్టి సారించింది. సొంత గ్యారేజీలు ఉన్నవారు, ఫ్లీట్ ఆపరేటర్లకు ప్రొప్రైటరీ సర్వీస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, టెక్నాలజీ యాక్సెస్ కల్పించడం ద్వారా కంపెనీ సర్వీస్ నెట్‌వర్క్‌ను విస్తరించినట్టు ప్రకటించింది. దీనివల్ల కంపెనీ విడిభాగాలు, సర్వీస్ ట్రైనింగ్ మాడ్యూల్స్, డయాగ్నస్టిక్ టూల్ కస్టమర్లకు మాత్రమే కాకుండా గ్యారేజీలు, మెకానిక్‌లు, ఫ్లీట్ ఆపరేట్లు కూడా అందుబాటులో ఉంటాయని ఓలా ఎలక్ట్రిక్ వెల్లడించింది. ఇకపై ఓలా ఎలక్ట్రిక్ ఒరిజినల్ విడిభాగాలను ఓలా ఎలక్ట్రిక్ కస్టమర్ యాప్, వెబ్‌సైట్ ద్వారా నేరుగా కొనుగోలు చేయవచ్చు. దీనివల్ల ప్రతి కస్టమర్, గ్యారేజ్ అధిక-నాణ్యత, సర్టిఫైడ్ విడిభాగాలను మధ్యవర్తులతో సంబంధం లేకుండా యాక్సెస్ చేయడానికి వీలవుతుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. రానున్న రోజుల్లో దశలవారీగా కంపెనీ డయాగ్నస్టిక్ టూల్స్, టెక్నీషియన్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్‌లకు యాక్సెస్‌ను విస్తరిస్తాం. తద్వారా మొత్తం కంపెనీ ఎకోసిస్టమ్ పూర్తిగా ఓపెన్, యాక్సెస్ లభిస్తుందని కంపెనీ పేర్కొంది. కాగా, తొలి నుంచి ఓలా ఎలక్ట్రిక్ తన వాహనాలను విక్రయించిన తర్వాత అందించే సర్వీసులపై విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో దీనిపై కంపెనీ దృష్టి సారించడం గమనార్హం.






