మార్చి నాటికి దేశవ్యాప్తంగా 200 ఎక్స్‌పీరియన్స్ సెంటర్ల ఏర్పాటు: ఓలా ఎలక్ట్రిక్!

by Disha Web Desk 16 |
మార్చి నాటికి దేశవ్యాప్తంగా 200 ఎక్స్‌పీరియన్స్ సెంటర్ల ఏర్పాటు: ఓలా ఎలక్ట్రిక్!
X

బెంగళూరు: దేశీయ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ దిగ్గజం ఓలా 2023, మార్చి నాటికి దేశవ్యాప్తంగా 200 కంటే ఎక్కువ ఎక్స్‌పీరియన్స్ సెంటర్లను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఇప్పటికే కంపెనీకి పలు చోట్ల 20 వరకు ఎక్స్‌పీరియన్స్ సెంటర్లు ఉన్నాయి. ఈ సెంటర్‌ల ద్వారా వినియోగదారులకు ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనేముందు మోడల్ వివరాలు తెలుసుకునేందుకు సులభతరమవుతుందని కంపెనీ వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ తెలిపారు. ఆన్‌లైన్ ద్వారా మాత్రమే కొనుగోళ్లకు పరిమితం కాకుండా వినియోగదారులు నేరుగా ఎక్స్‌పీరియన్స్ సెంటర్ల ద్వారా ఓలా ఈవీ స్కూటర్ల వివరాలు తెలుసుకునేందుకు వీలవుతుందని భవిష్ అగర్వాల్ చెప్పారు.

కొత్తగా ఏర్పాటు చేయబోయే ఎక్స్‌పీరియన్స్ సెంటర్లన్నీ కంపెనీ ఆధ్వర్యంలో నిర్వహించబడనున్నాయి. వీటిలో వినియోగదారులు ఓలా ఈవీ స్కూటర్ల డెమో, టెస్ట్ రైడ్‌తో పాటు అమ్మకాల తర్వాత సర్వెస్ వంటి సౌకర్యాలు లభిస్తాయని, దీనివల్ల వినియోగదారులకు సులభంగా అన్ని రకాల సేవలు అందుబాటులో ఉంటాయని కంపెనీ వివరించింది. ఓలా తన ఫ్లాగ్‌షిప్ ఎస్1 ప్రో స్కూటర్ అమ్మకాలు తగ్గుతున్న నేపథ్యంలో కంపెనీ ఈ ప్రకటన చేసింది. ఇందులో భాగంగా కంపెనీలోని కీలక ఎగ్జిక్యూటివ్‌లను వివిధ ప్రాంతాల్లో నియమిస్తూ అమ్మకాలను పెంచేందుకు ప్రయత్నాలు చేస్తోంది.



Next Story

Most Viewed