Ola: దేశవ్యాప్తంగా నాన్-ఏసీ రైడ్‌లను ప్రారంభించిన ఓలా

by S Gopi |

అన్ని ధరల్లో, రోజువారీ ప్రయాణ అవసరాలను తీర్చడంలో ఈ నిర్ణయం దోహదపడుతుందని పేర్కొంది.

Ola: దేశవ్యాప్తంగా నాన్-ఏసీ రైడ్‌లను ప్రారంభించిన ఓలా
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ ఓలా కన్స్యూమర్ మంగళవారం నాన్-ఏసీ రైడ్ కేటగిరీని దేశవ్యాప్తంగా ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో ఓలా దేశంలోనే ఈ రకమైన సేవలను అందించే ఏకైక సంస్థగా అవతరించింది. దీనివల్ల క్యాబ్ సేవల్లో ఎక్కువ ఆప్షన్లు లభిస్తాయని, ఇది కస్టమర్ల పట్ల కంపెనీ నిబద్ధతను బలోపేతం చేస్తుందని తెలిపింది. అన్ని ధరల్లో, రోజువారీ ప్రయాణ అవసరాలను తీర్చడంలో ఈ నిర్ణయం దోహదపడుతుందని పేర్కొంది. ముఖ్యంగా అర్బన్ ప్రాంతాల్లో నాన్-ఏసీ రైడింగ్ వల్ల తక్కువ ధరకే క్యాబ్ సేవలు లభిస్తాయి. లక్షలాది మంది ప్రజలు రోజువారీ, ధరల-ఆధారిత రవాణాపై ఆధారపడతారు. ఈ ఆఫర్ పూర్తిగా వారి అవసరాల చుట్టూనే రూపొందించామని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ సదుపాయం పైలట్ ప్రాజెక్ట్ రూపంలో ప్రారంభించిన సమయంలో మరింత పారదర్శకంగా, సరళంగా, సరసమైన ధరల రైడింగ్‌ను ప్రజలు ఎంతగా కోరుకుంటున్నారో తెలిసిందని ప్రతినిధి పేర్కొన్నారు. మరోవైపు తక్కువ ఏసీ వినియోగం, తక్కువ ఇంధన వాడకం, డ్రైవర్లు మెరుగైన ఆదాయాన్ని సాధించవచ్చని కంపెనీ వెల్లడించింది.

Next Story