- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ola Electric: 2 రోజుల హోలీ ఆఫర్లు ప్రకటించిన ఓలా ఎలక్ట్రిక్
ఈ రెండు రోజుల వ్యవధిలో కంపెనీ నిర్దేశించిన 90 నిమిషాల విండో సమయంలో హోలీ ఆఫర్ ఉంటుంది.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఈవీ స్కూటర్ల తయారీ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ హోలీ పండుగ సందర్భంగా ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. రెండు రోజుల పాటు హోలీ మహోత్సవ క్యాంపెయిన్ ద్వారా ఎలక్ట్రిక్ బైక్‌పై డిస్కౌంట్లు, ఇతర ప్రయోజనాలు అందిస్తున్నట్టు కంపెనీ తెలిపింది. ఇందులో భాగంగా మార్చి 3, 4 తేదీల్లో కంపెనీ ఎలక్ట్రిక్ బైక్ రోడ్‌స్టర్ ఎక్స్‌ను రూ. 79,999(ఎక్స్‌షోరూమ్) ప్రారంభ ధరకు అందుబాటులో ఉండనుంది. ఇదివరకు ఈ బైక్ ధర దాదాపు రూ. లక్ష వరకు ఉంది. ఈ రెండు రోజుల వ్యవధిలో కంపెనీ నిర్దేశించిన 90 నిమిషాల విండో సమయంలో హోలీ ఆఫర్ ఉంటుంది. కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో దీనికి సంబంధించి వివరాలు ఉంటాయి. పరిమిత యూనిట్లకు మాత్రమే ఈ డిస్కౌంట్ యాక్సెస్ లభిస్తుందని కంపెనీ పేర్కొంది. దీంతో పాటు కంపెనీ ఆఫర్ సమయంలో తన ఈవీ స్కూటర్లు ఎస్1 ప్రో(3 కిలోవాట్ అవర్, 4 కిలోవాట్ అవర్), ఎస్1 ప్రో ప్లస్(4 కిలోవాట్ అవర్) కొనుగోళ్లపై 8 ఏళ్ల ఎక్స్‌టెండెడ్ వారెంటీ కూడా ఇస్తున్నట్టు కంపెనీ తెలిపింది. ప్రస్తుతం ఈ స్కూటర్లపై 3 లేదా 4 ఏళ్ల వారెంటీ మాత్రమే కంపెనీ ఇస్తోంది. ఇవి కాకుండా, కంపెనీ దేశవ్యాప్తంగా 10 లక్షల కస్టమర్లకు చేరిన సందర్భంగా.. కంపెనీ స్పెషల్ కమ్యూనిటీ ప్రోగ్రామ్ 'ఓలా ఇన్‌సైడర్స్'లో ఉన్న కస్టమర్లకు హోలీ మహోత్సవం కింద అదనంగా రూ. 5,000 వరకు ప్రయోజనాలు పొందవచ్చని ఓలా ఎలక్ట్రిక్ వెల్లడించింది.






