- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Nvidia: నెలకు రూ. 8.59 కోట్ల అద్దెతో ఎన్విడియా కొత్త ఆఫీస్
మహాదేవపురలోని బాగ్మనె క్యాపిటల్‌లో సుమారు 7.6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణాన్ని 10 ఏళ్ల కాలానికి లీజుకు తీసుకున్నట్లు సమాచారం.

దిశ, బిజినెస్ బ్యూరో: గ్లోబల్ చిప్ తయారీ దిగ్గజం ఎన్విడియా భారత్‌లో మరింత వేగంగా విస్తరణ పనులు చేపడుతోంది. సోమవారం కంపెనీ బెంగళూరులో భారీ ఆఫీస్ స్పేస్‌ను లీజుకు తీసుకుంది. మహాదేవపురలోని బాగ్మనె క్యాపిటల్‌లో సుమారు 7.6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణాన్ని 10 ఏళ్ల కాలానికి లీజుకు తీసుకున్నట్లు సమాచారం. సుమారు రూ. 1,230 కోట్ల విలువతో ఎన్విడియా ఈ లీజుకు ఒప్పందం చేసుకుంది. రియల్ ఎస్టేట్ డేటా, అనలిటిక్స్, వర్క్‌ఫ్లో సొల్యూషన్స్ ప్లాట్‌ఫామ్ ప్రాప్‌స్టాక్ ప్రకారం, ఈ స్థలం 12 అంతస్తుల్లో విస్తరించి ఉండగా, కంపెనీ విస్తరణ ప్రణాళికలకు ఇది కీలకంగా ఉండనుంది. ప్రతి మూడేళ్లకు 15 శాతం పెంపుతో కంపెనీ నెలకు రూ. 8.59 కోట్ల అద్దెను (చదరపు అడుగుకు రూ. 113 చొప్పున) చెల్లించనుంది. ఈ స్థాయి అద్దె దేశంలో టెక్, ఏఐ రంగాలపై గ్లోబల్ కంపెనీల ఆసక్తికి సంకేతమని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.






