- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బద్దలైన అగ్ని పర్వతం.. టూరిస్టులపైకి దూసుకు వచ్చిన లావా, రాళ్లు
సెంట్రల్ అమెరికా దేశమైన గ్వాటెమాలాలో ప్రసిద్ధ 'డీ ఫ్యుగో' అగ్నిపర్వతం ఒక్కసారిగా బద్దలైంది.

దిశ, వెబ్ డెస్క్ : సెంట్రల్ అమెరికా దేశమైన గ్వాటెమాలాలో ప్రసిద్ధ 'డీ ఫ్యుగో' అగ్నిపర్వతం ఒక్కసారిగా బద్దలైంది. పర్వతం లోపలి నుంచి లావా, మండుతున్న పెద్ద పెద్ద రాళ్లు వందల మీటర్ల ఎత్తుకు గాల్లోకి ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదం జరిగిన సమయంలో అగ్నిపర్వతాన్ని అధిరోహిస్తున్న కొందరు పర్యాటకులపైకి లావా, వేడి రాళ్లు నేరుగా దూసుకొచ్చాయి. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన టూరిస్టులు ప్రాణాలు దక్కించుకోవడానికి అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ క్రమంలో కొందరికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం అందుతోంది.
33 కిలోమీటర్ల ఎత్తుకు ఎగసిన పొగ.. అలర్ట్ జారీ!
అగ్నిపర్వతం బద్దలైన తీవ్రతకు దాని నుంచి వెలువడిన దట్టమైన పొగ, బూడిద ఏకంగా 33 కిలోమీటర్ల ఎత్తుకు ఆకాశంలోకి ఎగిసిపడ్డాయి. ఈ తీవ్ర పరిణామంతో అప్రమత్తమైన గ్వాటెమాలా ప్రభుత్వం దేశంలో అత్యవసర అలర్ట్ జారీ చేసింది. అగ్నిపర్వతం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే ప్రజలందరూ సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఈ ప్రమాదంలో ఎంతమంది గాయపడ్డారు, ఎవరికైనా ప్రాణనష్టం జరిగిందా అనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సహాయక బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతున్నాయి.






