- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సహకార సంఘాల సందడి షురూ.. స్థానం కోసం కాంగ్రెస్ పార్టీ నేతల లాబీయింగ్
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సహకార సంఘాల సందడి షురూ మొదలైంది.

దిశ ప్రతినిధి, నిర్మల్: రాష్ట్రంలో కొత్త పాలసీ విధానంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, రైతు సేవ సహకార సంఘాలు, డిసీ ఎంఎస్, డిసిసిబి లకు ఎన్నికలు లేకుండా నామినేటెడ్ విధానంలో పదవులు ఇచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించిన నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో పదవుల సందడి మొదలైంది. ఒక్కొక్క సహకార సంఘంలో చైర్మన్ వైస్ చైర్మన్ సహా 12 మంది డైరెక్టర్ల పదవులు ఉన్న నేపథ్యంలో భారీగా కార్యకర్తలకు పదవులు దక్కనున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నాలుగు జిల్లాలు ఉండగా... కీలకమైన జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ జిల్లా కో-ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ వైస్ చైర్మన్ పదవులకు గట్టి పోటీ నెలకొనే అవకాశం ఉంది. నాలుగు జిల్లాలకు నాలుగు పదవులు ఇచ్చేలా కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇందులో కీలకమైన డిసిసిబి డిసిఎంఎస్ చైర్మన్ పదవులు ఇచ్చే విషయంలో పార్టీకి తలనొప్పి అవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఉమ్మడి జిల్లాలో భారీగా పదవులు...
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 77 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయి. అలాగే డి సి ఎం ఎస్, డి సి సి బి పాలకవర్గాలు ఉన్నాయి. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో 13 చొప్పున పదవులు ఉండగా... డిసిసిబి డిసిఎంఎస్ లలో 21 చొప్పున పదవులు ఉన్నాయి. రెండున్నర సంవత్సరాల కాలం తర్వాత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సుమారు 1000 మంది కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ పదవులు ఇవ్వనుంది. అనేకమంది మండల స్థాయి నాయకులకు పిఎసిఎస్ పదవులు దక్కనున్నాయి. అలాగే జిల్లా నేతలకు చైర్మన్ వైస్ చైర్మన్ జిల్లా డైరెక్టర్ పదవులు దక్కుతాయి.
ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జీలు కీలకం...
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సహకార సంఘాల చైర్మన్లు, వైస్ చైర్మన్, డైరెక్టర్లు ఎంపిక వ్యవహారం జిల్లాకు సంబంధించిన శాసనసభ్యులు నియోజకవర్గాల ఇన్చార్జిలు కీలకంగా మారనున్నారు. ఇప్పటికే అధిష్టానం వీరికి అర్హులైన వారిని గుర్తించి పార్టీకి నమ్మకంగా ఉన్న వారి పేర్లు పంపాలని ఆదేశాలు అందాయి ఈ మేరకు నియోజకవర్గ ఇన్చార్జీలు శాసనసభ్యులు తమకు అనుకూలంగా ఉన్న ముఖ్య నాయకులు కార్యకర్తలు పేర్ల జాబితాలను తయారుచేసి పనిలోపడ్డారు. ఈ క్రమంలోని శాసనసభ్యులు నియోజకవర్గ ఇన్చార్జిలా నివాసాలు ఆశావహుల అభ్యర్థులతో కిటకిటలాడుతున్నాయి. ఉమ్మడి జిల్లాకు సంబంధించి మంచిర్యాల, చెన్నూరు బెల్లంపల్లి ఖానాపూర్ నియోజకవర్గం లో అధికార పార్టీ శాసనసభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నిర్మల్ ముధోల్ ఆదిలాబాద్, బోథ్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లో పార్టీకి ఇన్చార్జి కొనసాగుతున్నారు. సిర్పూర్ నియోజకవర్గంలో మాత్రం ఎమ్మెల్సీ నియోజకవర్గ బాధ్యతలు చూస్తున్నారు. వీరు సమర్పించే జాబితాలో ప్రకారమే సంఘాలకు పాలకవర్గాలు ఖరారు చేస్తారని సమాచారం.






