- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
NPS Vatsalya Scheme: మీ పిల్లలు కోటీశ్వరులు అవ్వాలంటే ఈ స్కీములో చేరండి
NPS Vatsalya Scheme: కేంద్రప్రభుత్వం పిల్లల కోసం ఎన్పీఎస్ వాత్సల్య యోజన స్కీమును తీసుకువచ్చింది. ఇందులో మీ పిల్లల పేరు మీద ఇన్వెస్ట్ చేస్తే వారి భవిష్యత్తుకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది.

NPS Vatsalya Scheme: కేంద్రంలోని మోదీ సర్కార్ పిల్లల(Children's future) కోసం కొత్త పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని పేరు ఎన్పీఎస్ వాత్సల్య యోజన(NPS Vatsalya Scheme). ఇందులో మీ పిల్లల పేరు మీద పెట్టుబడి పెట్టినట్లయితే వారి భవిష్యత్తుకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. ఈ స్కీమ్ లో ఎంత పెట్టుబడి పెట్టాలి? ఎలా ఆదాయం వస్తుంది? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
తల్లిదండ్రులు వారి పిల్లల భవిష్యత్తు కోసం ఎంతో కష్టపడుతుంటారు. సంపాదలో కొంత దాచి పిల్లల భవిష్యత్తు కోసం బాటలు వేస్తుంటారు. మీరు కూడా అలా చేయాలనుకుంటే ఎన్పీఎస్ వాత్సల్య యోజన పథకం(NPS Vatsalya Scheme) మీకు ఒక మంచి ఐడియా అని చెప్పవచ్చు. ఇందులో మీరు చాలా తక్కువ పెట్టుబడితో పిల్లల భవిష్యత్తు(Children's future)లో ఒక మంచి అమౌంట్ ఇవ్వవచ్చు. కేంద్ర ప్రభుత్వం పిల్లలకు కోసం ఎన్పీఎస్ వాత్సల్య యోజన(NPS Vatsalya Scheme) అనే పెన్షన్ స్కీమ్ 2024లో ప్రారంభించింది. ఈ పథకం పిల్లలకు ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది .
తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు(Children's future) కోసం అవసరమైన డబ్బులు కొద్ది కొద్దిగా ఆధా చేయడానికి ఈ స్కీం ఎంతో ఉపయోగపడుతుంది. ఎన్పీఎస్ వాత్సల్య యోజన స్కీమ్(NPS Vatsalya Scheme) సెప్టెంబర్ 18 2024 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ స్కీములో 18 ఏళ్లలో పిల్లలను చేర్చడానికి వారి తల్లిదండ్రులు కానీ, గార్డియన్ గాని పెట్టుబడి పెట్టవచ్చు. పిల్లలకు 18ఏళ్లు నిండిన తర్వాత ఈ ఖాతాపై పూర్తిగా పిల్లలకు అధికారం వస్తుంది. ఈ డబ్బును వారి తల్లిదండ్రుల సహాయంతో భవిష్యత్తు అవసరాల కోసం ఉపయోగించవచ్చు.
ఈ పథకం కింద తల్లిదండ్రులు ఏడాదికి కనీసం 1000 రూపాయల పెట్టుబడి పెట్టాలి. అంతకుమించి ఎత్తైన పెట్టుబడి పెట్టుకోవచ్చు. పిల్లలకు 18 ఏళ్లు నిండే వరకు తల్లిదండ్రులు(Parents), గార్డియన్స్(Guardians) పెట్టుబడి పెట్టాలి. 18ఏళ్లునిండిన తర్వాత కూడా పిల్లల అంగీకారంతో ఈ స్కీం లో పెట్టబడులను కొనసాగించవచ్చు. లేదా పిల్లల చదువు, ఉద్యోగం, పెళ్లి ఇలా అవసరాలకు వాత్సల్య యోజన(NPS Vatsalya Scheme)లో పెట్టిన పెట్టుబడి 80% వరకు తీసుకోవచ్చు. వాత్సల్య యోజనలో పెట్టుబడిని మీరు కానీ 60 ఏళ్ల వరకు కొనసాగించినట్లయితే 10% రాబడి రేటుతో 2.75 కోట్లు పొందడానికి అవకాశం ఉంటుంది. ఇది పిల్లల భవిష్యత్తు(Children's future)ను మాత్రమే కాదు క్రమశిక్షణతో కూడిన ఆధా కూడా ప్రోత్సహిస్తుంది.
పిల్లల వయస్సు 18 నెల తర్వాత ఈ అకౌంట్ ను సాధారణ ఎన్పీఎస్ ఖాతాగా మారుస్తుంది. అప్పుడు మూడేళ్ల లాక్ ఇన్ వ్యవధి ఉంటుంది. ఆ తర్వాత 25% మొత్తాన్ని మూడుసార్లు విత్ డ్రా చేసుకోవచ్చు.
వాత్సల్య యోజన(NPS Vatsalya Scheme)లో చేరాలంటే ఈ డాక్యుమెంట్లు చాలా అవసరం. పిల్లల జనన ధ్రువీకరణ పత్రం, పాఠశాల బదిలీ సర్టిఫికెట్,మెట్రిక్యులేషన్ సర్టిఫికేట్, తండ్రి లేదా తల్లి సంరక్షకుడి ఐడి(ID), పాన్ కార్డ్(Pan card), పాస్ ఫొటో(Pass Photo) సబ్మిట్ చేయాలి. ఒకవేళ గార్డియన్ ఎన్నారై అయితే ఎన్ఆర్ఈ(NRE) లేదా ఎన్ఆర్ఓ(NRO) బ్యాంక్ అకౌంట్ ఉండాలి. మీ పిల్లలకు భవిష్యత్తులో ఆర్థిక భరోసా ఇవ్వాలనుకుంటే ఎన్పీఎస్ వాత్సల్య యోజన పథకంలో పెట్టుబడి పెట్టడం ఒక మంచి ముందడుగు అవుతుంది .






