NPCI: ఇకపై డిజిటల్ చెల్లింపులకు బయోమెట్రిక్ అథెంటికేషన్

by S Gopi |

పిన్ నంబర్‌కు బదులుగా ఫేస్ రికగ్నిషన్, ఫింగర్ ప్రింట్ ద్వారా లావాదేవీలు చేసుకోవచ్చు.

NPCI: ఇకపై డిజిటల్ చెల్లింపులకు బయోమెట్రిక్ అథెంటికేషన్
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ డిజిటల్ చెల్లింపులకు సంబంధించి యూపీఐ వ్యవస్థలో అతిముఖ్యమైన మార్పులు జరగనున్నాయి. ఈ మేరకు నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎన్‌పీసీఐ) అక్టోబర్ 8 నుంచి పిన్ నంబర్ అవసరం లేకుండానే చెల్లింపులు చేసే సదుపాయం ప్రారంభించనున్నట్టు వెల్లడించింది. పిన్ నంబర్‌కు బదులుగా ఫేస్ రికగ్నిషన్, ఫింగర్ ప్రింట్ ద్వారా లావాదేవీలు చేసుకోవచ్చు. గతంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) యూపీఐ చెల్లింపుల కోసం పిన్ నంబర్‌కు ప్రత్యామ్నాయ మార్గాలు ఉండాలని సూచించింది. ప్రస్తుతం 4 లేదా 6 నంబర్ల పిన్ నంబర్‌ను ఎంటర్ చేయడం ద్వారా లావాదేవీలు, చెల్లింపులు జరుపుతున్నాం. దీనికి తోడు కొత్తగా బయోమెట్రిక్ వివరాలను ఉపయోగించి చెల్లింపులు చేసే సదుపాయం తీసుకురావాలని ఎన్‌పీసీఐ భావించింది. దీనికోసం యూఐడీఏఐ డేటాలోని ఆధార్ బయోమెట్రిక్ వివరాలను ఉపయోగించే అవకాశం ఉంది. బుధవారం ముంబైలో జరిగే గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్టివల్‌లో ఈ కొత్త బయోమెట్రిక్ ఫీచర్‌ను ప్రారంభించాలని ఎన్‌పీసీఐ భావిస్తోంది.

Next Story