- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Flipkart: ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకానికి రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లు
బుల్లెట్ 350, క్లాసిక్ 350, హంటర్ 350, గోవాన్ క్లాసిక్ 350, మిటియొర్ 350 మోడళ్లు ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ మోటార్‌సైకిళ్ల తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలోకి అడుగుపెట్టింది. తొలిసారిగా కంపెనీ తన పోర్ట్‌ఫోలియోలోని 350సీసీ సామర్థ్యం కలిగిన బైకులను ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయించనుంది. సెప్టెంబర్ 22 నుంచి వీటి అమ్మకాలు మొదలవుతాయని, తొలుత బెంగళూరు, కోల్‌కతా, ముంబై, లక్నో, గురుగ్రాం నగరాల్లో ప్రారంభిస్తున్నట్టు కంపెనీ వెల్లడించింది. బుల్లెట్ 350, క్లాసిక్ 350, హంటర్ 350, గోవాన్ క్లాసిక్ 350, మిటియొర్ 350 మోడళ్లు ఐదు నగరాల్లో ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. డెలివరీ, అమ్మకాల తర్వాత సర్వీసెస్ రాయల్ ఎన్‌ఫీల్డ్ అధీకృత డీలర్ల వద్దనే ఉంటాయని కంపెనీ స్పష్టం చేసింది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేసే కస్టమర్లు సెప్టెంబర్ 22 నుంచి కేంద్రం తీసుకొచ్చిన పూర్తి జీఎస్టీ ప్రయోజనాలను కూడా పొందుతారని కంపెనీ తెలిపింది. అందుకనుగుణంగా 350సీసీ బైకులపై రూ.22,000 వరకు ధరలు తగ్గించామని పేర్కొంది. ఎక్కువ మంది రైడర్‌లకు తమ మోటార్‌సైకిళ్లను అందుబాటులో ఉంచడమే తమ లక్ష్యమని ఐషర్ మోటార్స్ ఎండీ, సీఈఓ బి గోవిందరాజన్ అన్నారు. ఫ్లిప్‌కార్ట్‌తో భాగస్వామ్యం ద్వారా డిజిటల్-ఫస్ట్ కస్టమర్‌లకు చేరువ అయ్యేందుకు వీలవుతుంది. ప్రస్తుతం ఐదు నగరాల్లోనే మాత్రమే ఈ సదుపాయం అందిస్తున్నాం. త్వరలో మరిన్ని నగరాల్లో లభిస్తాయని పేర్కొన్నారు.






