Rapido: ర్యాపిడో యాప్‌లో విమాన, బస్సు, రైలు టికెట్ బుకింగ్‌ సౌకర్యం

by S Gopi |   (  Updated:2025-10-15 16:51:18  IST  )

యాప్‌లోనే విమాన, బస్సు, రైలు టికెట్ బుకింగ్‌ సదుపాయాన్ని మొదలుపెట్టింది.

Rapido: ర్యాపిడో యాప్‌లో విమాన, బస్సు, రైలు టికెట్ బుకింగ్‌ సౌకర్యం
X

దిశ, బిజినెస్ బ్యూరో: రైడ్‌షేరింగ్ ప్లాట్‌ఫామ్ ర్యాపిడో క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే ఫుడ్ డెలివరీ సేవలను ప్రారంభించిన కంపెనీ, బుధవారం తన యాప్‌లోనే విమాన, బస్సు, రైలు టికెట్ బుకింగ్‌ సదుపాయాన్ని మొదలుపెట్టింది. దీనికోసం గోఐబీబో, రెడ్‌బస్, కన్ఫర్మ్ టికెటితో భాగస్వామ్యం చేసుకున్నామని, దీని ద్వారా హోటళ్లు, విమానాలు, ఇంటర్-సిటీ బస్సులు, రైలు టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చని ర్యాపిడో తెలిపింది. ఈ సదుపాయంతో కస్టమర్లు తక్కువ సమయంలో విమానాశ్రయానికి వెళ్లెందుకు టికెట్లను బుక్ చేసుకోవచ్చని, సెలవులకు ప్లాన్ చేసినా, ఏదైనా ప్రయాణం చేయాలనుకున్న కేవలం కొన్ని క్లిక్‌ల దూరంలో టికెట్లు బుక్ అవుతాయని ర్యాపిడో అధికారిక ప్రకటనలో పేర్కొంది. ర్యాపిడో యాప్‌లోని హోమ్ స్క్రీన్‌లో 'ట్రావెల్ ' ఆప్షన్ ఎంచుకుని, విమాన టికెట్లతో పాటు హోటళ్లు, బస్సులు, రైలు టికెట్లను బుక్ చేసుకోవచ్చు. 5 కోట్ల నెలవరీ యాక్టివ్ యూజర్లతో ర్యాపిడో దేశవ్యాప్తంగా డెలివరీ సేవల్లో కనెక్టివిటీ అంతరాలను తగ్గిస్తోంది. దీన్ని కొనసాగిస్తూ రోజువారీ ప్రయాణాల్లో ఉండే లక్షలాది మందికి మరింత సులభంగా, నమ్మకంతో సేవలను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నామని ర్యాపిడో పేర్కొంది.

కేవలం రూ.30వేలకే vivo V60e.. 200 మెగాపిక్సల్ కెమెరాతో పాటు ఇతర ఫీచర్స్ ఇవే!

Next Story