Coca-Cola: పెరగనున్న కోకా-కోలా ధరలు

by S Gopi |   (  Updated:2026-03-23 14:31:49  IST  )

ప్లాస్టిక్ సీసాలు, మూతలు, లేబుల్స్, కార్డ్‌బోర్డ్ పెట్టెల వంటి వస్తువులన్నీ చమురు, ప్రపంచ సరఫరాపై ఆధారపడి ఉంటాయి.

Coca-Cola: పెరగనున్న కోకా-కోలా ధరలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావం ఇంధన ధరలపైనే కాకుండా, ఇప్పుడు కోకా-కోలా వంటి ఉత్పత్తులను కూడా ఖరీదైనవిగా మారుస్తున్నాయి. ఇందుకు ప్రధానంగా పెరుగుతున్న చమురు ధరల వల్ల ముడి పదార్థాల ఖర్చులు భారం కావడమే. ప్లాస్టిక్ సీసాలు, మూతలు, లేబుల్స్, కార్డ్‌బోర్డ్ పెట్టెల వంటి వస్తువులన్నీ చమురు, ప్రపంచ సరఫరాపై ఆధారపడి ఉంటాయి. యుద్ధం కారణంగా, ఈ ఖర్చులు గణనీయంగా పెరిగాయి, ఇది పానీయాల కంపెనీలపై ఒత్తిడి పెంచుతోంది. ఫలితంగా, మనదేశంలో కోకా-కోలాను విక్రయించే కంపెనీలు ధరలను స్థిరంగా కొనసాగించడం కష్టంగా ఉందని చెబుతున్నాయి. అధిక ఖర్చులు ఇలాగే కొనసాగితే, తాము ధరలను పెంచవలసి రావచ్చని కోకాకోలాను విక్రయించే ఎస్ఎల్ఎంజీ డిప్యూటీ సీఈఓ రాహుల్ కుమార్ స్పష్టం చేశారు. వాస్తవానికి, పెరుగుతున్న ప్యాకేజింగ్ ఖర్చుల కారణంగా బాటిల్ వాటర్ వంటివి ఇప్పైకే ఖరీదైనవిగా మారాయి. ఇప్పుడు మార్కెట్లోని ఇతర ఉత్పత్తులకూ విస్తరిస్తోందని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి.

Next Story