నాన్‌వెజ్ ప్రియులకు షాక్.. పెరిగిన ధరలు

by Jakkula.Mamatha |   (  Updated:2026-02-08 03:23:41  IST  )

రెండు రాష్ట్రాల మాంసం ప్రియులకు ఊహించని షాక్ తగిలింది.

నాన్‌వెజ్ ప్రియులకు షాక్.. పెరిగిన ధరలు
X

దిశ,వెబ్‌డెస్క్: సండే(Sunday) వస్తే చాలు అందరి ఇళ్లలో తప్పక చికెన్ లేదా మటన్ కర్రీ వాసన గుమగుమలాడాల్సిందే. కొంతమంది వారానికి ఒకసారి మాత్రమే చికెన్ కర్రీ తింటే మరికొంతమంది మాత్రం వారానికి రెండు మూడు సార్లు అయిన చికెన్ తింటుంటారు. ఈ తరుణంలో ఆదివారం వస్తే మాంసం ప్రియులకు ముక్క లేనిదే ముద్ద దిగదు. సాధారణంగా సండే రోజు చాలా మంది వీకాఫ్, పిల్లలకు స్కూల్ హాలిడే ఉండటంతో చికెన్‌తో స్పైసీగా వివిధ రకాల వంటకాలు చేసి కుటుంబ సభ్యులతో ఆనందంగా తింటుంటారు.

ఈ క్రమంలో రెండు రాష్ట్రాల మాంసం ప్రియులకు ఊహించని షాక్ తగిలింది. తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు(Chicken prices) స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్‌లో(Hyderabad)) స్కిన్‌లెస్ చికెన్ ధర రూ.270 నుంచి రూ.280 మధ్య ఉండగా.. విజయవాడ(Vijayawada), విశాఖపట్నం (Vishakapatnam)లో రూ.230 నుంచి రూ.255 వరకు కొనసాగుతోంది. గుంటూరు, తిరుపతిలో స్కిన్ లెస్ కేజీ రూ.220-230 వరకు పలుకుతోంది. ఆదివారం కావడంతో డిమాండ్ పెరిగి ధరలు ప్రభావితమయ్యాయి. ప్రాంతాన్ని బట్టి ఈ ధరల్లో రూ.10 నుంచి రూ.20 తేడా ఉండవచ్చు. వేసవిలో కోళ్ళ ఉత్పత్తి తగ్గడం కూడా ధరలు పెరుగుదలకు కారణం కావచ్చని పలువురు భావిస్తున్నారు. రెండు రాష్ట్రాల్లో మటన్ కేజీ ధర రూ.900-1000 వరకు ఉంది. అయితే చికెన్ ధరలు ఒక్కసారిగా పెరగడంతో మాంసం ప్రియులు షాక్‌కు గురవుతున్నారు.

Next Story