Tata Trusts: టాటా గ్రూపులో ట్రస్టీగా మెహ్లి మిస్త్రీ పునఃనియామకానికి లభించని ఆమోదం

by S Gopi |

టాటా గ్రూప్‌లో అంతర్గత విభేదాలున్నాయనే ఊహాగానాలకు ఇది మరింత ఊతమిచ్చినట్టు అయింది.

Tata Trusts: టాటా గ్రూపులో ట్రస్టీగా మెహ్లి మిస్త్రీ పునఃనియామకానికి లభించని ఆమోదం
X

దిశ, బిజినెస్ బ్యూరో: దివంగత రతన్ టాటా సన్నిహితుడు, వ్యాపారవేత్త మెహ్లి మిస్త్రీని టాటా ట్రస్టుల్లో ఎదురుదెబ్బ తగిలింది. టాటా ట్రస్టుల చైర్మన్ నోయెల్ టాటా, ఆయనకు సన్నిహితులుగా భావిస్తున్న మరో ఇద్దరు ట్రస్టీలు, ట్రస్టీగా మెహ్లీ మిస్త్రీ పునఃనియామకాన్ని అడ్డుకున్నారు. ఈ పరిణామంతో టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీని నియంత్రించే దాతృత్వ విభాగంలో విభేదాలను మరింత పెంచిందని సంస్థ వర్గాలు చెబుతున్నాయి. టాటా గ్రూప్‌లో అంతర్గత విభేదాలున్నాయనే ఊహాగానాలకు ఇది మరింత ఊతమిచ్చినట్టు అయింది. టాటా గ్రూపునకు చెందిన కీలకమైన మూడు దాతృత్వ ట్రస్టులకు జీవితకాల ట్రస్టీగా తిరిగి నియమించడానికి చేసిన ప్రతిపాదనను ఆమోదించలేదు. ఈ నిర్ణయంతో మిస్త్రీకి టాటా ట్రస్టులతో సంబంధాలు తెగినట్టేనని తెలుస్తోంది. గత వారం టాటా ట్రస్ట్ సీఈఓ సర్ రతన్ టాటా ట్రస్టుతో పాటు సర్ దోరాబ్జీ టాటా ట్రస్ట్, బాయి హీరాబాయి జమ్షెడ్జీ టాటా నవ్సారీ ఛారిటబుల్ ఇన్‌స్టిస్ట్యూషన్‌కు ట్రస్టీగా మెహ్లీ మిస్త్రీ నియామకాన్ని ప్రతిపాదించారు. దీనికి ట్రస్టీలు నోయల్ టాటా, వేణు శ్రీనివాసన్, విజయ్ సింగ్ వ్యతిరేకించారు.

Next Story