IOC: రష్యా చమురు దిగుమతులను ఆపలేదు: ఐఓసీ ఛైర్మన్

by S Gopi |

అమెరికా సుంకాలు విధించిందనే కారణంతో కొనుగోళ్లు తగ్గించడం, పెంచడం జరగదు. అటువంటి ఆదేశాలు కూడా ప్రభుత్వం నుంచి రాలేదు.

IOC: రష్యా చమురు దిగుమతులను ఆపలేదు: ఐఓసీ ఛైర్మన్
X

దిశ, బిజినెస్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల బెదిరింపులకు ప్రతిస్పందనగా రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ నిలిపివేయలేదని, ఆర్థిక అంశాలను పరిగణలోకి తీసుకుని మాత్రమే కొనుగోళ్లు కొనసాతుతాయని దేశంలోని అతిపెద్ద చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) చైర్మన్ ఏఎస్ సాహ్ని అన్నారు. అయితే, రష్యా ముడి చమురు గ్రేడ్‌లపై అందించే డిస్కౌంట్‌ల ఆధారంగా కొనుగోలు పరిమాణంలో నెలవారీగా హెచ్చుతగ్గులు ఉండొచ్చు. ఐఓసీ లాంటి సంస్థలు ఆర్థికపరమైన అంశాల ఆధారంగానే దీనిపై నిర్ణయం తీసుకుంటాయి. అమెరికా సుంకాలు విధించిందనే కారణంతో కొనుగోళ్లు తగ్గించడం, పెంచడం జరగదు. అటువంటి ఆదేశాలు కూడా ప్రభుత్వం నుంచి రాలేదు. చమురు దిగుమతులను తగ్గించడం కూడా లేదని, రష్యా చమురు కొనుగోలు యథావిధిగానే కొనసాగిస్తున్నామని సాహ్ని వివరించారు. ఇదే సమయంలో డొనాల్డ్ ట్రంప్ కోసం అమెరికా నుంచి చమురు కొనుగోళ్లు పెంచాలనే ఆదేశాలకు సంబంధించిన ఊహాగానాలకు చెక్ పెడుతూ.. అమెరికా అయినా, మరే దేశం నుంచి అయినా చమురు కొనడంపై ఎలాంటి ఆదేశాలు రాలేదు. ఆర్థికంగా ప్రయోజనాలను చూసే సంస్థ కార్యకలాపాలు జరుగుతాయని సాహ్ని స్పష్టం చేశారు.

Next Story