- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
SEBI: 'ఆధారాల్లేకుండా ఆరోపణలు వద్దు': సెబీ చీఫ్
స్వతంత్ర డైరెక్టర్లు బాధ్యతాయుతంగా ఉండాలి, వారు చేసే ఏ వ్యాఖ్యలైనా మైనారిటీ వాటాదారుల ప్రయోజనాలపై ప్రభావం చూపుతాయన్నారు.

దిశ, బిజినెస్ బ్యూరో: ఇటీవల ప్రైవేట్ రంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు పార్ట్‌టైమ్ ఛైర్మన్ అతాను చక్రవర్తి రాజీనామా నేపథ్యంలో మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం జరిగిన సెబీ బోర్డు సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడిన సెబీ ఛైర్మన్ తుహిన్ కాంత పాండే.. స్వతంత్ర డైరెక్టర్లు బాధ్యతాయుతంగా ఉండాలి, వారు చేసే ఏ వ్యాఖ్యలైనా మైనారిటీ వాటాదారుల ప్రయోజనాలపై ప్రభావం చూపుతాయన్నారు. స్వతంత్ర డైరెక్టర్లు అత్యంత కీలమైన స్థానంలో ఉంటారు. కంపెనీని ప్రశ్నించే అధికారం వారికి ఉండవచ్చు. ఇదే సమయంలో మైనారిటీ వాటాదారుల ప్రయోజనాలను కాపాడేలా వారి ధోరణి ఉండాలన్నారు. రికార్డుల్లో సరైన ఆధారాలు లేకుండా ఎవరూ ఎలాంటి నిందారోపణలు చేయకూడదు. స్వతంత్ర డైరెక్టర్లు ఒక నిర్దిష్ట ప్రవర్తనా నియమావళికి కట్టుబడి ఉండాలి. కంపెనీ నిర్వహణ లేదా ప్రతిపాదిత చర్యపై వారికి ఏవైనా సందేహాలు, ఆందోళనలు ఉంటే, వాటిని బోర్డు దృష్టికి తీసుకువచ్చేలా చూడాలి. ఒకవేళ అవి పరిష్కారం కాకపోతే, తమ ఆందోళనలను బోర్డు మీటింగ్ మినిట్స్‌లో ఎంటర్ చేయమని పట్టుబట్టాలని తుహిన్ కాంత పాండే సూచించారు.






