- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Zero Balance Accounts: జీరో బ్యాలెన్స్ అకౌంట్లకు కూడా డిజిటల్ బ్యాంకింగ్ సేవల విస్తరణ
కొన్ని రకాల సేవలను బ్యాంకులు ఖాతాదారులకు ఉచితంగానే లభిస్తాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ (బీఎస్‌బీడీ) అకౌంట్లకు సంబంధించి సేవలను విస్తరిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీనివల్ల జీరో బ్యాలెన్స్ అకౌంట్లు ఉన్న వారు కూడా ఇకమీదట డిజిటల్ బ్యాంకింగ్ సేవలను ఉపయోగించవచ్చు. కొన్ని రకాల సేవలను బ్యాంకులు ఖాతాదారులకు ఉచితంగానే లభిస్తాయి. ఉచితంగా అందించే సేవల్లో బ్యాంకు బ్రాంచులు, ఏటీఎం, సీడీఎంలలో నగదు డిపాజిట్ చేయడంతో పాటు నెలకు కనీసం 4 విత్‌డ్రా అవకాశం ఉంటుంది. ఇదే సమయంలో నియంత్రిత సంస్థల ద్వారా ఫిర్యాదుల పరిష్కారాలను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని ఇంటర్నల్ అంబుడ్స్‌మన్ మెకానిజం ప్రతిపాదించినట్టు ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా బుధవారం ఎంపీసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల గురించి వెల్లడిస్తూ చెప్పారు. దీనికోసం అంబుడ్స్‌మన్ వ్యవస్థను సవరణలు చేయనున్నట్టు తెలిపారు. గ్రామీణ సహకార బ్యాంకులనూ ఈ పథకం కిందకు తెచ్చే చర్యలు తీసుకుంటామన్నారు. కానీ, జీరో బ్యాలెన్స్ అకౌంట్లు ఉన్న వారు అదే బ్యాంకులో మరో సేవింగ్స్ అకౌంట్ ప్రారంభించేందుకు వీలుండదు. ఒకవేళ ఖాతాదారు సదరు బ్యాంకులో ఇప్పటికే సేవింగ్స్ ఉంట్డి, జీరో బ్యాలెన్స్ అకౌంట్ తెరిస్తే, 30 రోజుల్లోగా సేవింగ్స్ అకౌంట్‌ను మూసేయాల్సి ఉంటుంది. సాధారణ కేవైసీ నిబంధనలతో కూడా బీఎస్‌బీడీ అకౌంట్‌ను ప్రారంభించవచ్చు.






