- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CIBIL Score: క్రెడిట్ స్కోర్ చెక్ చేయకుండా ఇచ్చే లోన్స్ ఇవే.. తప్పక తెలుసుకోండి!
CIBIL Score: సిబిల్ స్కోర్(CIBIL Score) బాగుంటేనే లోన్స్, క్రెడిట్ కార్డులు లభిస్తుంటాయి.

దిశ, వెబ్ డెస్క్: CIBIL Score: సిబిల్ స్కోర్(CIBIL Score) బాగుంటేనే లోన్స్, క్రెడిట్ కార్డులు లభిస్తుంటాయి. అయితే సిబిల్ స్కోర్ (CIBIL Score)తక్కువగా ఉన్నవారు ఏమాత్రం టెన్షన్ పడాల్సిన పనిలేదు. ఇలాంటి వారు ఓ వైపు క్రెడిట్ స్కోరు(Credit score)ను పెంచుకుంటూనే..మరోవైపు ఈ స్కోర్ చెక్ చేయకుండా ఇచ్చే లోన్స్ కోసం ట్రై చేసుకోవచ్చు. ఆర్థిక అత్యవసరాల్లో మాత్రమే ఈ తరహా లోన్స్ కోసం ట్రై చేస్తుండాలి. క్రెడిట్ స్కోర్(Credit score), క్రెడిట్ రిపోర్టులను చెక్ చేయకుండా ఇచ్చే లోన్స్ లో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అందుకే వాటితో ముడిపడిన సానుకూల, ప్రతికూల అంశాలను తప్పకుండా దరఖాస్తుదారులు తెలుసుకోవల్సి ఉంటుంది. నెలలవారీ ఇంటి బడ్జెట్, ఆదాయ స్థాయిలు, తిరిగి చెల్లించే సామర్ధ్యాలను పరిగణలోనికి తీసుకుని ఇలాంటి రుణం తీసుకోవాలా..వద్దా అనేదానిపై ఆచితూచి నిర్ణయాన్ని తీసుకోవాలి. ఇప్పుడు మనం క్రెడిట్(Credit score) చెక్ చేయకుండా ఇచ్చే లోన్స్ గురించి తెలుసుకుందాం.
1పే డే లోన్స్(Pay Day Loans):
ఇది స్వల్పకాలిక లోన్. తక్కువ మొత్తంలోనే లోన్ వస్తుంది. లోన్ మంజూరు క్రమంలో వసూలు చేసే ప్రాసెసింగ్ ఫీజు మాత్రం ఎక్కువగా ఉంటుంది. లోన్ తీసుకున్న మరుసటి నెలలో శాలరీ రాగానే చెల్లించాలి. ఆలస్యం చేస్తే ఫైన్ విధిస్తారు. అంతేకాదు లోన్ పై వడ్డీ రేటు కూడా ఎక్కువగానే ఉంటుంది.
2. ఫిన్ టెక్ నుంచి పర్సనల్ లోన్స్(Personal loans from fintech) :
లోన్స్ ఇచ్చే మొబైల్ యాప్స్, వెబ్ సైట్స్ ను ఫిట్నెక్స్ అని పిలుస్తుంటారు. కొన్ని ఫిన్ టెక్స్ క్రెడిట్ స్కోర్ ను చూడకుండానే లోన్స్ ఇస్తుంటాయి. ఆదాయం, ఉద్యోగం ఆధారంగా ఇవి లోన్ మంజూరు చేస్తాయి. వడ్డీ రేటు కూడా ఎక్కువగానే ఉంటుంది.
3. సెక్యూర్డ్ లోన్స్(Secured Loans):
సెక్యూర్డ్ లోన్స్ అంటే సురక్షితమైనవని అర్థం. బంగారం, ఆస్తులు తనఖా పెట్టి ఈ లోన్స్ పొందవచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్ చేసి లోన్ తీసుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగులతో పూచీకత్తు ఇప్పించి లోన్ తీసుకోవచ్చు. క్రెడిట్ హిస్టరీని చూడకుండానే ఈ లోన్ ఇస్తారు.
4. శాలరీ అడ్వాన్స్(Salary Advance) :
ఉద్యోగులు తాము పనిచేసే కంపెనీ లేదా సంస్థ నుంచి శాలరీ అడ్వాన్స్ పొందవచ్చు. కొన్ని కంపెనీలే ఈ తరహా సౌకర్యాన్ని కల్పిస్తుంటాయి. ఎలాంటి వడ్డీ లేకుండానే ఈ అడ్వాన్స్ ఇస్తాయి. ప్రతినెలా కొంత చొప్పున శాలరీ అడ్వాన్సును తిరిగి చెల్లించవచ్చు. ఈ అడ్వాన్స్ తీసుకుంటే శాలరీ నుంచి ప్రతినెలా కొంత మొత్తాన్ని ఈఎంఐగా కంపెనీయే వసూలు చేస్తుంది. మిగతా మొత్తాన్ని ఉద్యోగి శాలరీలో జమ చేస్తుంది.
క్రెడిట్ లేకుండా ఇచ్చే లోన్స్ వల్ల బెనిఫిట్స్ (Benefits of loans without credit)
తొందరగా, సులభంగా లోన్స్ మంజూరు చేస్తారు. క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉన్నవారికి ఉపయోగకరంగా ఉంటుంది. కేవలం ఆదాయం, ఉద్యోగం ఆధారంగా మాత్రమే లోన్ ఇస్తారు.
ప్రతికూలతలు (Disadvantages)
ఇందులో వడ్డీరేటు ఎక్కువగా ఉంటుంది. త్వరగా చెల్లించాల్సి ఉంటుంది. ఒత్తిడి పెరుగుతుంది. ప్రాసెసింగ్ ఫీజు కూడా ఎక్కువగా ఉంటుంది. అప్పులఊబిలో చిక్కుకునే ప్రమాదం పెరుగుతుంది. కొన్ని మొబైల్ యాప్స్, వెబ్ సైట్లు లోన్స్ పేరుతో మోసగించే ఛాన్స్ ఉంటుంది. హిడెన్ ఛార్జీలు కూడా ఎక్కువగానే ఉంటాయి.






