Adani Group: ఎవరికీ లంచాలు ఇవ్వలేదు: అదానీ గ్రూప్ సీఎఫ్ఓ

by S Gopi |
Adani Group: ఎవరికీ లంచాలు ఇవ్వలేదు: అదానీ గ్రూప్ సీఎఫ్ఓ
X

దిశ, బిజినెస్ బ్యూరో: కాంట్రాక్టులను దక్కించుకునేందుకు ప్రభుత్వ అధికారులకు ఎలాంటి లంచాలు ఇవ్వలేదని అదానీ గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జుగేషిందర్ సింగ్ శుక్రవారం అన్నారు. 'అలాంటి ప్రయత్నాలేమీ జరగలేదని 100 శాతం ఖచ్చితంగా తెలుసు. ఎందుకంటే ఎవరికైనా అంత నగదు చెల్లిస్తున్నట్లయితే, తనకు ఖచ్చితంగా తెలుస్తుందని ' సంస్థకు చెందిన ఓ ఈవెంట్‌లో పాల్గొన్న సందర్భంగా విలేకరులతో చెప్పారు. గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ, అతని మేనల్లుడు సాగర్ అదానీతో సహా ఇతరులపై యూఎస్‌లో చేసిన ఆరోపణలు ప్రత్యేక అధికారాల కింద వచ్చాయని, ఇది గ్రూప్‌పై దాడి అనుకోవట్లేదని స్పష్టం చేశారు. ఆరోపణల్లో పేర్కొన్న వ్యక్తులు అవసరమైన చోట స్పందిస్తారు ఆయన తెలిపారు. ఇదే సమయంలో అదానీ గ్రూప్ ప్రాథమిక వైఖరి ప్రకటించిన విధంగా పెట్టుబడులు, వృద్ధి ప్రణాళికలను కొనసాగిస్తుంది. మూలధన నిధులకు కట్టుబడి ఉన్నామని, అన్ని ప్రాజెక్టులను కొనసాగిస్తామని జుగేషిందర్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed