- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నీతా అంబానీ కోసం స్పెషల్ కారు.. ఏకంగా 100 కోట్లు.. ఫీచర్స్ ఇవే ?
ఆడి A9 చామెలియన్ పేరుతో లాంచ్ అయిన ఈ కారును.. నీతా అంబానీ ప్రత్యేకంగా విదేశాల నుంచి తీసుకువస్తున్నారట.

దిశ, వెబ్ డెస్క్: రిలయన్స్ అధినేత అంబానీ ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కోట్లల్లో సంపాదన... లక్షల్లో ఉద్యోగులు.. భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే శక్తి అంబానీ కుటుంబానికి సొంతం. అయితే అలాంటి అంబానీ భార్య నీతా అంబానీ కొత్త కారు కొనుగోలు చేయబోతున్నారట. ఈ కారు ధర ఏకంగా 100 కోట్లు ఉంటుందని చెబుతున్నారు. ఆడి A9 చామెలియన్ పేరుతో లాంచ్ అయిన ఈ కారును.. నీతా అంబానీ ప్రత్యేకంగా విదేశాల నుంచి తీసుకువస్తున్నారట. అయితే 100 కోట్లు పెట్టి అంబానీ ఫ్యామిలీ కొంటున్న ఈ కారు ఫీచర్స్ ఒకసారి పరిశీలిద్దాం.
ఈ ఆడి కారు ధర దాదాపు 100 కోట్లు ఉంటుందని చెబుతున్నారు. ఈ కారు గరిష్టంగా గంటకు 250 కిలోమీటర్ల వేగంతో దూసుకు వెళ్తుంది. దీన్ని ఊసరవెల్లి కారు అని చెప్పవచ్చు. ఇందులో ఉండే బటన్ టెక్నాలజీని నొక్కితే.. రకరకాలుగా కారు రంగు మారుతూ ఉంటుందట. అలాగే బుల్లెట్ ప్రూఫ్ గా కూడా ఈ 100 కోట్ల కారు పనిచేస్తుందన్నమాట. 600 హార్స్ పవర్ ఉన్న ఈ కారులో 4.0 లీటర్ v8 ఇంజన్ సౌకర్యం కూడా ఉంటుంది. ఈ కారు మైలేజ్ కూడా బాగానే ఉంటుందని అంటున్నారు. ఇన్ని ఫీచర్స్ ఉన్నాయి కాబట్టే నీతా అంబానీ ఈ కారు కొనుగోలు చేసేందుకు.. నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. గతంలోనే ఈ వార్తలు రాగా... ఇప్పుడు మళ్లీ ఇదే అంశం తెరపైకి వచ్చింది.






