- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Nissan: 20,000 మందిని తొలగించే యోచనలో నిస్సాన్
ఆర్థిక, వ్యాపార నష్టాల కారణంగా భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించడంపై నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిపింది.

దిశ, బిజినెస్ బ్యూరో: జపాన్‌కు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ నిస్సాన్ కీలక ప్రకటన విడుదల చేసింది. ఆర్థిక, వ్యాపార నష్టాల కారణంగా భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించడంపై నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిపింది. ప్రధానంగా కార్ల అమ్మకాలు పడిపోవడం, తద్వారా నష్టాలు అధికం కావడంతో కఠిన చర్యలకు సిద్ధమవుతున్నామని, కంపెనీలోని 20,000 మందిని తొలగించే యోచనలో ఉన్నట్టు పేర్కొంది. వీరు మొత్తం ఉద్యోగుల్లో 15 శాతానికి సమానమని తెలుస్తోంది. 2024, నవంబర్ సమయంలో కంపెనీ అమెరికా, చైనా మార్కెట్లలో అమ్మకాలు దెబ్బతిన్న కారణంగా ఏకంగా 94 శాతం మేర లాభాలను కోల్పోయింది. ఆ నష్టాన్ని భర్తీ చేసేందుకు 9,000 మందిని తొలగిస్తామని కంపెనీ ప్రకటించింది. కానీ, ఈ సంఖ్యకు రెట్టింపు కంటే ఎక్కువమందికి ఉద్వాసన పలకాలని కంపెనీ నిర్ణయించినట్టు జపాన్ జాతీయ మీడియా ఎన్‌హెచ్‌కే వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కంపెనీ రికార్డు స్థాయిలో 700-750 బిలియన్ యెన్‌ల నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని కంపెనీ అంచనా వేసింది. ఈ నష్టం ప్రధానంగా కంపెనీ విలువ తగ్గడం వల్లే. మరోవైపు, కంపెనీ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో వందలాది మంది ఉద్యోగులకు ముందస్తు పదవీ విరమణ చేయాలని కోరినట్టు సమాచారం. ఇది గనక అమలైతే గత 18 ఏళ్లలోనే మొదటి ముందస్తు పదవీ విరమణ చర్య కానుంది.






