- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Budget-2025: వరుసగా 8వ బడ్జెట్‌తో చరిత్ర సృష్టించనున్న నిర్మలా సీతారామన్
ఈ బడ్జెట్‌తో మాజీ ప్రధాని మోరార్జీ దేశాయ్ 10 బడ్జెట్‌ల రికార్డుకు నిర్మలా సీతారామన్ చేరువకానున్నారు.

దిశ, బిజినెస్ బ్యూరో: 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర బడ్జెట్ విడుదలకు ఒకరోజు మాత్రమే మిగిలుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఎనిమిదోసారి బడ్జెట్‌ను సమర్పిస్తూ చరిత్ర సృష్టించనున్నారు. దేశీయంగా వృద్ధి బలహీనంగా ఉండటం, అధిక ధరలు, వేతనాల పెరగకపోవడం వంటి అనేక సమస్యలతో పోరాడుతున్న మధ్యతరగతిపై భారం తగ్గించే చర్యలు ఉంటాయనే అంచనాలు ఉన్నాయి. ఈ బడ్జెట్‌తో మాజీ ప్రధాని మోరార్జీ దేశాయ్ 10 బడ్జెట్‌ల రికార్డుకు నిర్మలా సీతారామన్ చేరువకానున్నారు. మోరార్జీ దేశాయ్ 1959-1964 మధ్య ఆర్థిక మంత్రిగా 6 బడ్జెట్‌లు, 1967-69 మధ్య 4 బడ్జెట్‌లను సమర్పించారు. మాజీ ఆర్థిక మంత్రులు పి చిదంబరం 9 బడ్జెట్‌లు, ప్రణం ముఖర్జీలు 8 బడ్జెట్‌లను సమర్పించారు. అయితే, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హయాంలో వరుసగా ఎనిమిది బడ్జెట్‌లను ప్రవేశ పెట్టిన రికార్డులను నిర్మలా సీతారామన్ సొంతం చేసుకోనున్నారు.
2019లో ప్రధాని మోడీ రెండోసారి గెలిచినప్పుడు నిర్మలా సీతారామన్ భారత మొదటి పూర్తిస్థాయి మహిళా ఆర్థిక మంత్రిగా నియమితులయ్యారు. ఆ తర్వాత 2024లో మూడోసారి మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సీతారామన్ తన ఆర్థిక శాఖను దక్కించుకున్నారు. ఇప్పటివరకు ఆమె 2024, ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్‌తో సహా మొత్తం ఏడు వరుస బడ్జెట్‌లను సమర్పించారు.
బడ్జెట్‌కు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం..
మొదటి బడ్జెట్
దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొట్టమొదటి కేంద్ర బడ్జెట్‌ను నవంబర్ 26, 1947న తొలి ఆర్థిక మంత్రి ఆర్‌కె షణ్ముఖం శెట్టి సమర్పించారు.
అత్యధిక బడ్జెట్‌లు
అత్యధిక బడ్జెట్‌లు ప్రవేశపెట్టిన వ్యక్తిగా మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ రికార్డు కలిగి ఉన్నారు. ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ హయాంలో, ఆ తర్వాత ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి హయాంలో ఆయన ఆర్థిక మంత్రిగా ఉన్న కాలంలో మొత్తం 10 బడ్జెట్‌లను సమర్పించారు.
అత్యధిక బడ్జెట్‌లలో రెండవది
మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం తొమ్మిది పర్యాయాలు బడ్జెట్‌ను సమర్పించారు. ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ నేతృత్వంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వ హయాంలో ఆయన తొలిసారిగా 1996, మార్చి 19న బడ్జెట్‌ను సమర్పించారు. మరుసటి సంవత్సరం అదే ప్రభుత్వ హయాంలో ఆయన మరో బడ్జెట్‌ను సమర్పించారు. 2009లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ అధికారంలోకి వచ్చాక మరొకసారి ఆర్థిక మంత్రి 2004-2008 మధ్య ఐదు బడ్జెట్‌లను సమర్పించారు. 2013,2014లలో బడ్జెట్‌లను సమర్పించారు.
అత్యధిక బడ్జెట్‌లో మూడవది
ప్రణబ్ ముఖర్జీ ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో ఎనిమిది బడ్జెట్‌లను ప్రవేశపెట్టారు. ఆయన 1982, 1983, 1984లలో మూడు బడ్జెట్‌లు, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంలో 2009-2012 మధ్య ఐదు వరుస బడ్జెట్‌లను సమర్పించారు.
మన్మోహన్ సింగ్
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 1991-1995 మధ్య పీవీ నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఐదు వరుస బడ్జెట్‌లను సమర్పించారు.
సుదీర్ఘమైన బడ్జెట్ ప్రసంగం
ఫిబ్రవరి 1, 2020న నిర్మలా సీతారామన్ ప్రెజెంటేషన్ రెండు గంటల 40 నిమిషాల పాటు ప్రసంగించడం ద్వారా సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగం చేసిన రికార్డును కలిగి ఉన్నారు. ఆ సమయంలో కొంత నీరసంగా ఉండటంతో ఆమె తన ప్రసంగాన్ని ఇంకా రెండు పేజీలు మిగిలి ఉండగానే ఆపేశారు.
అతి తక్కువ బడ్జెట్ ప్రసంగం
1977లో హిరూభాయ్ ముల్జీభాయ్ పటేల్ చేసిన మధ్యంతర బడ్జెట్ ప్రసంగం ఇప్పటివరకు కేవలం 800 పదాలతో కూడిన అతి చిన్న బడ్జెట్‌గా ఉంది.
సమయం
గతంలో ఫిబ్రవరి చివరి రోజు సాయంత్రం 5 గంటలకు బడ్జెట్‌ను సమర్పించేవారు. అప్పట్లో లండన్, భారత్ ఇరు దేశాలకు అనుగుణంగా ఉండేందుకు ఆ సమయాన్ని నిర్ణయించారు. భారత కాలమానం బ్రిటీష్ సమయం కంటే 4 గంటల 30 నిమిషాలు ముందుంటుంది. కాబట్టి రెండు దేశాల్లోనూ వీలుగా సాయంత్రం 5 గంటలకు బడ్జెట్‌ను సమర్పించడం సాంప్రదాయంగా ఉండేది. దీన్ని 1999లో అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో అప్పటి ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా ఉదయం 11 గంటలకు మార్చారు. అప్పటి నుంచి ఉదయం 11 గంటలకు బడ్జెట్‌ను సమర్పిస్తున్నారు. అలాగే, 2017లో బడ్జెట్ సమర్పించే తేదీని ఫిబ్రవరి 1కి మార్చారు. మార్చి నాటికి పార్లమెంటరీ ఆమోద ప్రక్రియను పూర్తి చేసేందుకు, ఏప్రిల్ 1 నుంచి ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి బడ్జెట్‌ను అమలు చేయాల్సి ఉండటం వంటి అంశాల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.






