- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరోసారి జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసిన నిఫ్టీ!
బుధవారం స్టాక్ మార్కెట్ 25,052 మార్కును అందుకొని, దేశీయ స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. దీంతో నిఫ్టీ మరోసారి జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది.

దిశ, వెబ్ డెస్క్: బుధవారం స్టాక్ మార్కెట్ 25,052 మార్కును అందుకొని, దేశీయ స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. దీంతో నిఫ్టీ మరోసారి జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. అంతర్జాతీయ మార్కెట్ లోని మిశ్రమ ఫలితాలతో, దేశీయ మార్కెట్ నష్టాల్లో ప్రారంభమైనప్పటికీ.. తర్వాత క్రమక్రమంగా లాభాల్లో కొనసాగింది. మొత్తానికి సెన్సెక్స్ 73 పాయింట్లతో లాభపడి 81,785 దగ్గర ముగియగా.. నిఫ్టీ 34 పాయింట్లు లాభపడి 25,052 దగ్గర ముగిసింది. రూపాయి మారకం విలువ డాలర్ తో పోలిస్తే.. రూ. 83.92 వద్ద ముగిసింది.
అయితే, నిఫ్టీ లో.. విప్రో, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎల్టీఐఎండ్ ట్రీ, దివీస్ ల్యాబ్స్, భారతీ ఎయిర్టెల్ లు అత్యధికంగా లాభాల్లో కొనసాగగా.. నెస్లే ఇండియా, మారుతి సుజుకీ, ఏషియన్ పెయింట్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్ ఇంకా బ్రిటానియా ఇండస్ట్రీస్ నష్టాల్లో ముగిసాయి. మిగిలిన రంగాల్లో ఫార్మా, హెల్త్ కేర్, ఐటీ రంగాలు ఒక శాతానికి పైగా వృద్ధిని కొనసాగించాయి.






