NGT: ప్లాస్టిక్ వ్యర్థాల వాడకంపై టొబాకో కంపెనీలకు ఎన్జీటీ నోటీసులు

by S Gopi |

ప్రస్తుత నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ది సిటిజన్స్ ఫౌండేషన్ అనే సంస్థ తన పిటిషన్‌లో పేర్కొంది.

NGT: ప్లాస్టిక్ వ్యర్థాల వాడకంపై టొబాకో కంపెనీలకు ఎన్జీటీ నోటీసులు
X

దిశ, బిజినెస్ బ్యూరో: గుట్కా, పాన్ మసాలా, పొగాకు ఉత్పత్తుల తయారీదారులు ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ నియమాలు-2016ను ఉల్లంఘిస్తున్నారని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) నోటీసులు జారీ చేసింది. టొబాకో కంపెనీలు నిషేధిత ప్లాస్టిక్ ప్యాకేజింగ్ ముడిపదార్థాలను ఇప్పటికీ ఉపయోగిస్తున్నాయని, ప్రస్తుత నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ది సిటిజన్స్ ఫౌండేషన్ అనే సంస్థ తన పిటిషన్‌లో పేర్కొంది. నిబంధనలను ఉల్లంఘించే యూనిట్లను మూసివేయడం, పర్యావరణ పరిహారాన్ని తిరిగి పొందే చర్యలు తీసుకోవాలని పిటిషనర్ తెలిపారు. ఈ క్రమంలో జస్టిస్ ప్రకాష్ శ్రీవాస్తవ, నిపుణులు డాక్టర్ ఎ సెంథిల్ వెల్ నేతృత్వంలోని ధర్మాసనం కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (సీపీసీబీ), ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ (డీపీసీసీ)తో సహా సంబంధిత అధికారులకు దీనిపై స్పందించాలని కోరుతూ నోటీసులు జారీ చేసింది. గతంలో సీపీసీబీ పర్యావరణ అనుకూల ప్యాకేజింగ్ నిబంధనలను అమలు చేయకపోతే కార్యకలాపాలను నిలిపేస్తామని ఆదేశాలు ఇచ్చినప్పటికీ, వాటిని అమలు చేయలేదని పిటిషనర్ తరపు న్యాయవాది చెప్పారు. అంతేకాకుండా ప్యాకేజింగ్‌కు అవసరమైన పర్యావరణానుకూల ముడిపదార్థాలను వాడేందుకు కావాల్సిన సమయం చెప్పాలని, ఆలస్యమైతే వడ్డీతో సహా పరిహారం చెల్లించాలని కూడా సీపీసీబీ కంపెనీలకు హెచ్చరించింది.

Next Story