పతనమైన బంగారం .. స్థిరంగానే వెండి

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-03-09 06:12:26  IST  )

బంగారం ధర భారీగా తగ్గింది. 10 గ్రాముల బంగారంపై రూ.1960 తగ్గింది.

పతనమైన బంగారం .. స్థిరంగానే వెండి
X

దిశ, వెబ్‌డెస్క్: గతవారంలో శుక్రవారం వరకూ పతనమవుతూ వచ్చిన బంగారం ధర.. శనివారం భారీగా పెరిగింది. తాజాగా బంగారం రేటు మళ్లీ తగ్గింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1960 తగ్గగా.. రూ.1,61,680కి దిగొచ్చింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1800 తగ్గగా.. రూ.1,48,200కి పతనమైంది. దీంతో కొనుగోలు దారులు బంగారం కొనుగోలుకు మక్కువ చూపుతున్నారు. కిలో వెండి ధర రూ.2,90,000 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో లాభాల స్వీకరణ (Profit Booking), డాలర్ బలపడటం వంటి కారణాల వల్ల ధరలు తగ్గుతున్నాయి. ప్రస్తుతం స్టాక్ మార్కెట్లు భారీగా పతనమవుతున్నాయి. మార్కెట్లు అనిశ్చితిగా ఉన్నప్పుడు బంగారం ఎప్పుడూ సురక్షితమైన పెట్టుబడిగా మారుతుంది. మదుపరులు బంగారంపై పెట్టుబడులు పెంచితే.. ధరలు పెరిగే ఛాన్స్ ఉంది.

Next Story