Renault Duster: భారత మార్కెట్లోకి కొత్త రెనాల్ట్ డస్టర్ రీ-ఎంట్రీ

by S Gopi |

భారత వాహన మార్కెలో ఎస్‌యూవీ మోడళ్లకు క్రేజ్ తీసుకొచ్చిన ఈ కారు తయారీ 2022లో ఆగిపోయింది.

Renault Duster: భారత మార్కెట్లోకి కొత్త రెనాల్ట్ డస్టర్ రీ-ఎంట్రీ
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ కార్ల ప్రియులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఎస్‌యూవీ డస్టం మోడల్ తిరిగి భారత మార్కెట్లోకి రీ-ఎంట్రీ ఇచ్చింది. ప్రముఖ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్ సోమవారం ఈ కారును విడుదల చేసింది. భారత వాహన మార్కెలో ఎస్‌యూవీ మోడళ్లకు క్రేజ్ తీసుకొచ్చిన ఈ కారు తయారీ 2022లో ఆగిపోయింది. అయితే, అప్పటి నుంచి కార్ల ప్రియులు ఈ కారు కోసం వేచి చూస్తున్నారు. కొంత విరామం తర్వాత ఎట్టకేలకు లాంచ్ అయిన డస్టర్ మోడల్ కోసం రూ. 21,000 ప్రీ-బుకింగ్ చెల్లించి సొంతం చేసుకోవచ్చని కంపెనీ వెల్లడించింది. మార్చి నాటికి దీని అధికారిక ధరలను ప్రకటిస్తామని, ఏప్రిల్ రెండో వారం తర్వాత నుంచి డెలివరీ ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలిపింది. భారత్‌లో తొలిసారిగా డస్టర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఆప్షన్‌ను పరిచయం చేస్తోంది. కనెక్టివిటీ కోసం ఇన్-బిల్ట్ గూగుల్ అసిస్టెంట్ ఉంటుందని రెనాల్ట్ గ్రూప్ ఇండియా సీఈఓ స్టీఫెన్ డెబ్లైస్ అన్నారు. ఈ కారు ఏడేళ్ల వారెంటీతో వస్తుందని, టర్బో రిమ్‌ల డెలివరీ ఏప్రిల్ నుంచి మొదలవుతాయని, హైబ్రిడ్ వేరియంట్లు దీపావళి నాటికి అందిస్తామని ఆయన వివరించారు. డస్టర్ రీ-ఎంట్రీ ద్వారా దేశీయ మార్కెట్లో ఇప్పటికే ఉన్న హ్యూండాయ్ క్రెటా, మారుతీ సుజుకి విక్టోరిస్, టయోట హైరైడర్, టాటా సియెరా లాంటి మోడళ్లకు గట్టి పోటీ ఉండనుంది.

Next Story