Agarbattis: అగర్‌బత్తీల తయారీకి కొత్త బీఐఎస్ ప్రమాణాలు

by S Gopi |

అగరబత్తీల తయారీలో హానికరమైన రసాయనాలను వాడకుండా నిషేధించింది.

Agarbattis: అగర్‌బత్తీల తయారీకి కొత్త బీఐఎస్ ప్రమాణాలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రపంచంలోనే అతిపెద్ద 'అగరబత్తి' ఉత్పత్తిదారు, ఎగుమతిదారుగా దేశీయ తయారీలో కొన్ని క్రిమిసంహారక రసాయనాలను నిషేధించడం కోసం కెంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు వినియోగదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కొత్త నాణ్యతా ప్రమాణాలను విడుదల చేసింది. అగరబత్తీల తయారీలో హానికరమైన రసాయనాలను వాడకుండా నిషేధించింది. వినియోగదారుల భద్రతతో పాతు పర్యావరణంపై పడే ప్రభావం, గాలి నాణ్యత, సువాసన, కెమికల్స్‌పై అంతర్జాతీయ ఆంక్షలను దృష్టిలో ఉంచుకుని బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌(బీఐఎస్) ఐఎస్19412:2025 ప్రమాణాలను తెచ్చింది. కొత్త ప్రమాణాలకు అనుగుణంగా అగరబత్తీలు ఉండటంతో పాటు బీఐఎస్ హాల్‌మార్క్ ద్వారా వినియోగదారులు అగరబత్తీలను కొనే సమయంలో నమ్మకమైన సమాచారం చూసి కొంటారని కేంద్ర వినియోగదారు వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇదే సమయంలో బీఐఎస్ ప్రమాణాలకు సంబంధించి అగరబత్తీలు, ధూప సామగ్రి తయారీలో ఉపయోగించడానికి నిషేధించబడిన పదార్థాల జాబితాను పేర్కొంది. అలెత్రిన్, పెర్మెత్రిన్, సైపర్‌మెత్రిన్, డెల్టామెత్రిన్, ఫిప్రొనిల్ లాంటి రసాయనాలను వాడొద్దని వాడొచ్చని స్పష్టం చేసింది. డైఫినైలమైన్, బెంజైల్ సైనైడ్, ఇథైల్ అక్రిలెట్ వంటి సింథటిక్ సుగంధాలను కూడా ఉపయోగించవచ్చని తెలిపింది. ఈ నిషేధం వల్ల మనదేశంలో తయారయ్యే అగరబత్తీలకు గ్లోబల్ మార్కెట్లో గిరాకీ పెరుగుతునని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం మనదేశంలో అగరబత్తీల పరిశ్రమ రూ. 8 వేల కోట్ల వ్యాపారం జరుగుతోంది.

Next Story