- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Credit card: క్రెడిట్ కార్డు విషయంలో ఈ 3 తప్పులు అస్సలు చేయకండి.. భారీగా డబ్బులు నష్టపోయే ఛాన్స్..
Credit card: మీరు క్రెడిట్ కార్డు వాడుతున్నారా..అయితే జాగ్రత్త..ఎన్ని కార్డ్స్ కావాలంటే అన్ని కార్డ్స్ మెయింటైన్ చేయండి.

దిశ, వెబ్ డెస్క్: Credit card: మీరు క్రెడిట్ కార్డు వాడుతున్నారా..అయితే జాగ్రత్త..ఎన్ని కార్డ్స్ కావాలంటే అన్ని కార్డ్స్ మెయింటైన్ చేయండి. కానీ ఈ మూడు తప్పులు అస్సలు చేయకండి. మొదటిది క్రెడిట్ యూటిలైజేషన్ రేషియో విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉదాహరణకు మీ కార్డు లిమిట్ లక్ష రూపాయలు అనుకుందాం. అప్పుడు మీరు ప్రతి నెల రూ, 80,000 వాడినట్లయితే మీ క్రెడిట్ యూటిలైజేషన్ రేషియో 80% ఇలా ప్రతి మంత్ 30% కన్నా ఎక్కువ లిమిట్ ని వాడితే, మీరు ఆన్ టైం లో వడ్డీ కట్టినా కూడా మీ సిబిల్ స్కోర్ తగ్గుతుంది కానీ పెరగదు. ఈ సమస్య నుంచి బయటపడాలి అంటే మీ కార్డులో 30% కన్నా తక్కువ లిమిట్ వాడాల్సి ఉంటుంది. ఆన్ టైం మీరు బిల్లు కడితే మీ సిబిల్ స్కోర్ కూడా కచ్చితంగా పెరుగుతుంది.
ఇక చాలామంది చేసే రెండో తప్పు. క్రెడిట్ కార్డుతో ఏటిఎం కి వెళ్లి డబ్బుని విత్ డ్రా చేస్తూ ఉంటారు. అలా చేస్తే చాలా వరకూ ఛార్జీలు పడుతుంటాయి. ఈ పొరపాటు అసలు చేయకూడదు ఏటీఎం ఉపయోగించి క్రెడిట్ కార్డు ద్వారా డబ్బులు అస్సలు విత్డ్రా చేయకూడదు ఇలా చేసినట్లయితే మీరు పెద్ద మొత్తంలో వడ్డీలు చెల్లించాల్సి ఉంటుంది ఇది 30 నుంచి 40 శాతం వరకు ఉండే అవకాశం ఉంది. కనుక క్రెడిట్ కార్డుతో కేవలం షాపింగ్ మాత్రమే చేయాల్సి ఉంటుంది అని గుర్తుంచుకోండి. క్రెడిట్ కార్డు ని కేవలం పిఓఎస్ మిషిన్స్ ద్వారా అలాగే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కోసం వాడాలి. అంతేకానీ దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ క్యాష్ అనేది విత్ డ్రా చేయకూడదు.
ఇక చాలామంది చేసే మూడో తప్పు ఏంటంటే బిల్లులో మినిమమ్ అమౌంట్ కడుతూ ఉంటారు. ఇది చాలా పెద్ద తప్పు మీ బిల్లులో కనిపించే పూర్తి అవుట్ స్టాండింగ్ కట్టాలి. అప్పుడు అవుట్ స్టాండింగ్ మీకు సున్నా వడ్డీ పడుతుంది. మీరు కనుక మినిమం అమౌంట్ బిల్లు రూపంలో కడుతున్నట్లు అయితే అది అసలు కాదని గుర్తుంచుకోవాలి అది కేవలం వడ్డీ మాత్రమే. కావాలంటే మీ బిల్లును ఇఎంఐ రూపంలో కన్వర్ట్ చేసుకొని ప్రతి నెల చెల్లించుకోవచ్చు.
అయితే దీనికి అదనంగా వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అందుకే క్రెడిట్ కార్డు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి క్రెడిట్ కార్డును ఎంత జాగ్రత్తగా వాడుకుంటే అంత మంచిది ఎందుకంటే ఇది మీకు 0% వడ్డీతో లభిస్తున్న డబ్బు అని భావించాలి. క్రెడిట్ కార్డులు సరిగ్గా వాడుకుంటే దీని ద్వారా మీకు రివార్డ్ పాయింట్లు కూడా లభిస్తాయి. వీటిని వాడుకొని ఉపయోగించుకొని పెట్రోల్, షాపింగ్, రెస్టారెంట్, మూవీ టిక్కెట్లపై డిస్కౌంట్ పొందవచ్చు.






