నెట్‌ఫ్లిక్స్, వార్నర్ బ్రదర్స్ భారీ డీల్.. ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో సంచలనం

by Ramesh Naini |

ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో సంచలనం చోటుచేసుకుంది. ప్రపంచ వినోద రంగంలో భారీ డీల్ కుదిరింది.

నెట్‌ఫ్లిక్స్, వార్నర్ బ్రదర్స్ భారీ డీల్.. ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో సంచలనం
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో సంచలనం చోటుచేసుకుంది. ప్రపంచ వినోద రంగంలో భారీ డీల్ కుదిరింది. స్ట్రీమింగ్ జెయింట్ నెట్‌ఫ్లిక్స్ (Netflix), హాలీవుడ్‌లో అత్యంత పురాతన, దిగ్గజ స్టూడియోల్లో ఒకటైన వార్నర్ బ్రదర్స్ డిస్కవరీకు చెందిన సినిమా, టీవీ స్టూడియోలు, స్ట్రీమింగ్ యూనిట్‌ను కొనుగోలు చేసేందుకు అంగీకరించింది. ఈ డీల్ విలువ సుమారు 72 బిలియన్ డాలర్లు.

పెద్ద పెద్ద కంపెనీలను వెనక్కి నెట్టిన నెట్‌ఫ్లిక్స్

ఈ హక్కుల కోసం కామ్‌కాస్ట్, పారామౌంట్ స్కైడాన్స్ వంటి దిగ్గజ సంస్థలు కూడా పోటీ పడ్డాయి. అయితే వాటిని మించిపోయి నెట్‌ఫ్లిక్స్ ఈ భారీ కొనుగోలును ఫైనలైజ్ చేయడం విషేశం. ఇప్పటికే హ్యారీ పోటర్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ సహా అనేక HBO మ్యాక్స్‌ ఫ్రాంచైజీల స్ట్రీమింగ్ హక్కులు నెట్‌ఫ్లిక్స్‌ వద్ద ఉన్న విషయం తెలిసిందే. ఈ డీల్ విజయవంతం కావడంలో అమెరికా ఫెడరల్ నియంత్రణ సంస్థల ఆమోదం కీలకం కానుంది.

ఈ అంశంపై బోకే క్యాపిటల్ పార్ట్నర్స్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ కిమ్ ఫారెస్ట్ మాట్లాడుతూ.. స్ట్రీమింగ్ రంగంలో ప్రధాన సంస్థ అయిన నెట్‌ఫ్లిక్స్ ఈ పోటీలో నెగ్గడం ఆశ్చర్యకరమని పేర్కొన్నారు. ఇక, ఈ భారీ కొనుగోలుతో నెట్‌ఫ్లిక్స్ షేర్ ధరను వెంటనే పెంచుతుందేమో అనేది చర్చనీయాంశంగా మారింది. 2022 నుంచి ఐదింతలు పెరిగిన నెట్‌ఫ్లిక్స్‌ స్టాక్‌ మళ్లీ ఎగబాకేందుకు ఇన్వెస్టర్లు మరింత బలమైన ట్రిగ్గర్ కోసం ఎదురు చూస్తున్నారని చర్చ జరుగుతోంది. ఈ డీల్ పూర్తి అయితే, వినోద రంగంలో శక్తి సమీకరణాలు మారే అవకాశమున్నాయని ఇండస్ట్రీ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Next Story