- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Net Direct Tax: ఫిబ్రవరి 10 నాటికి నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ. 17.78 లక్షల కోట్లు
ఫిబ్రవరి 10 నాటికి నికర కార్పొరేట్ పన్ను వసూళ్లు 6 శాతం ఎక్కువగా రూ. 7.78 లక్షల కోట్లు పెరిగాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు ఫిబ్రవరి 10 నాటికి 14.69 శాతం వృద్ధితో రూ. 17.78 లక్షల కోట్లకు చేరుకున్నాయని ప్రభుత్వ గణాంకాలు మంగళవారం వెల్లడించాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) విడుదల చేసిన డేటా ప్రకారం.. ప్రధానంగా వ్యక్తిగత ఆదాయపు పన్నుతో సహా నికర కార్పొరేట్ యేతర పన్నులు 21 శాతం పెరిగి సుమారు రూ.9.48 లక్షల కోట్లకు చేరుకున్నాయి. గతేడాది ఏప్రిల్ నుంచి 2025, ఫిబ్రవరి 10 నాటికి నికర కార్పొరేట్ పన్ను వసూళ్లు 6 శాతం ఎక్కువగా రూ. 7.78 లక్షల కోట్లు పెరిగాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు సెక్యూరిటీల లావాదేవీల పన్ను (ఎస్‌టీటీ) నుంచి నికర వసూళ్లు 65 శాతం పెరిగి రూ.49,201 కోట్లకు చేరుకున్నాయి. ఇదే సమయంలో రూ. 4.10 లక్షల కోట్ల కంటే ఎక్కువ రీఫండ్‌లు జారీ అయ్యాయి. ఇది గతేడాదితో పోలిస్తే 42.63 శాతం అధికం. సమీక్షించిన సమయానికి స్థూలంగా ప్రత్యక్ష పన్నులు 19.06 శాతం అధికంగా రూ. 21.88 లక్షల కోట్లకు పైగా వచ్చాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సవరించిన అంచనాల ప్రకారం, ప్రభుత్వం ఆదాయపు పన్ను వసూళ్లు రూ. 11.87 లక్షల కోట్ల నుంచి రూ. 12.57 లక్షల కోట్లకు సవరించింది. అలాగే, ఎస్‌టీటీ వసూళ్లు రూ. 37 వేల కోట్ల నుంచి రూ. 55 వేల కోట్లకు సవరిచింది. అయితే, కార్పొరేట్ పన్ను వసూళ్లు రూ. 10.20 లక్షల కోట్ల నుంచి రూ. 9.80 లక్షల కోట్లకు తగ్గుతాయని బడ్జెట్‌లో సవరించింది.






