- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Net Direct Tax: నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ. 12.92 లక్షల కోట్లు
గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే రీఫండ్లు 18 శాతం తగ్గి రూ. 2.42 లక్షల కోట్లకు చేరాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 7 శాతం పెరిగి రూ.12.92 లక్షల కోట్లకు చేరాయి. కార్పొరేట్ పన్నులు అధికంగా వసూలు కావడంతో పాటు పన్ను రిఫండ్‌లు నెమ్మదించడం ఇందుకు దోహదపడ్డాయని ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే రీఫండ్లు 18 శాతం తగ్గి రూ. 2.42 లక్షల కోట్లకు చేరాయి. నికర కార్పొరేట్ పన్ను వసూళ్లు దాదాపు రూ. 5.08 లక్షల కోట్ల నుంచి రూ. 5.37 లక్షల కోట్లకు పెరిగాయి. వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాల పన్ను రూ. 6.62 లక్షల కోట్ల నుంచి రూ. 7.19 లక్షల కోట్లకు చేరాయి. సెక్యూరిటీల లావాదేవీ పన్ను వసూళ్లు రూ.35,923 కోట్ల నుంచి రూ.35,682 కోట్లకు స్వల్పంగా తగ్గాయి. రిఫండ్‌ల సర్దుబాటుకు ముందు స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు ఏడాది క్రితంతో పోలిస్తే 2.15 శాతం ఎక్కువగా రూ. 15.35 లక్షల కోట్లకు పెరిగాయి. మొత్తంగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం రూ. 25.20 లక్షల కోట్ల నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.






