NPCI: వేరబుల్ పేమెంట్స్ కోసం మ్యూజ్‌తో ఎన్‌పీసీఐ భాగస్వామ్యం

by S Gopi |

మ్యూస్ వ్యాలెట్ ఎన్‌పీసీఐకి చెందిన రూపే నెట్‌వర్క్ ద్వారా దేశంలోనే మొట్టమొదటి వేరబుల్ పేమెంట్ ఎకోసిస్టమ్‌

NPCI: వేరబుల్ పేమెంట్స్ కోసం మ్యూజ్‌తో ఎన్‌పీసీఐ భాగస్వామ్యం
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో డిజిటల్ చెల్లింపులను మరింత విస్తరించేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌పీసీఐ) కీలక చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే తాజాగా ప్రముఖ టెక్ స్టార్టప్ మ్యూస్ వేరబుల్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా మ్యూస్ వ్యాలెట్ ఎన్‌పీసీఐకి చెందిన రూపే నెట్‌వర్క్ ద్వారా దేశంలోనే మొట్టమొదటి వేరబుల్ పేమెంట్ ఎకోసిస్టమ్‌ను ప్రారంభించింది. దీంతో మ్యూస్ వేరబుల్స్‌కు చెందిన స్మార్ట్ రింగ్, రింగ్ వన్ ద్వారా తక్షణ, సురక్షితమైన చెల్లింపులు చేసేందుకు వీలవుతుంది. ఈ సదుపాయాన్ని ఉపయోగించి ఏదైనా నియర్ ఫీల్ద్ కమ్యూనికేషన్(ఎన్ఎఫ్‌సీ), ఎనేబుల్డ్ పాయింట్-ఆఫ్-సేల్(పీఓఎస్) టెర్మినల్‌లో చెల్లింపులు చేయవచ్చు. దీనికోసం ఎలాంటి ఫోన్, కార్డ్, వ్యాలెట్ అవసరంల్దు. ఇప్పటికే ఇలాంటి సదుపాయాన్ని మ్యూస్ వేరబుల్స్ 40కి పైగా దేశాల్లో అమలు చేస్తోంది. దాదాపు 600 బ్యాంకుల నుంచి కార్డులకు సపోర్ట్ చేస్తోంది. ఇప్పుడు తాజాగా భారత్‌లోనూ ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశీయంగా మ్యూస్ రూపే ద్వారా టైర్2, టైర్3 నగరాలతో పాటు లక్షలాది మందికి సురక్షితమైన, సులభమైన డిజిటల్ చెల్లింపులను అందించేందుకు పనిచేయనున్నట్టు కంపెనీ అధికారిక ప్రకటనలో పేర్కొంది.

Next Story