- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Multibaggar Stock: ఇదిరా అసలుసిసలైన స్టాక్ అంటే.. 5ఏళ్ల క్రితం లక్ష పెట్టుబడి పెట్టినవారు కోటీశ్వరులు అయ్యారుగా!
Multibaggar Stock: స్టాక్ మార్కెట్లో దీర్ఘకాలిక పెట్టుబడి కొందరికి మంచి లాభాలు ఇస్తుంటాయి.

దిశ, వెబ్‌డెస్క్: Multibaggar Stock: స్టాక్ మార్కెట్లో దీర్ఘకాలిక పెట్టుబడి కొందరికి మంచి లాభాలు ఇస్తుంటాయి. ఆవిధంగా మంచి రిటర్న్స్ ఇచ్చిన కంపెనీలో రాజ్ రేయాన్ ఉంది. ఎందుకంటే మల్టీ బ్యాగర్ లాభాలతో ఇన్వెస్టర్ల జేబులను నింపింది.
స్టాక్ మార్కెట్లో దీర్ఘకాలంలో పెట్టుబడిదారులకు మల్టీబ్యాగర్ రాబడిని ఇచ్చిన అనేక పెన్నీ స్టాక్స్ ఎన్నో ఉన్నాయి. అలాంటి పెన్నీ స్టాక్ రాజ్ రేయాన్. మంగళవారం ఈ స్టాక్ ట్రేడింగ్ ముగిసే సమయానికి 1.97శాతం పెరిగి..20.21దగ్గర ముగిసింది. రాజ్ రేయాన్ స్టాక్స్ పెట్టుబడిదారులపై గత 5ఏళ్లలో డబ్బు వర్షం కురిపించింది. రాజ్ రేయాన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 1993లో స్థాపించారు. ఇది పాలిస్టర్ చిప్స్ తయారీ వ్యాపారంలో నిమగ్నమై ఉంది. ఈ కంపెనీ ఉత్పత్తుల జాబితాలో ట్రైలోబల్, కోట్ లాక్, ఫైర్ రిటార్డెంట్, ఆక్టాలోబల్ నూలు ఉన్నాయి. ఇది తన ఉత్పత్తులను అనేక దేశాలకు ఎగుమతి చేస్తుంది. దీనిలో బ్రెజిల్, చిలీ, కొలంబియా, ఈజిప్ట్, పెరూ, స్పెయిన్, సిరియా, థాయిలాండ్, వియత్నాం వంటి దేశాలు ఉన్నాయి.
ఈ స్టాక్ గత కొంతకాలంగా పెట్టుబడిదారులకు అద్బుతమైన రాబడిని అందిస్తోంది. ఎన్ఎస్ఈలో ఈ షేరు ప్రస్తుత ధర రూ. 20. 43గా ఉంది. గత ఐదేళ్లలో పెట్టుబడిదారులు 39,960శాతం లాభాన్ని పొందారు. అంటే ఐదేళ్ల క్రితం కేవలం 5పైసలు ఉన్న ఈ షేరు ధర ఇప్పుడు రూ. 20కి పెరిగింది. ఐదేళ్ల క్రితం ఈ షేరులో 1లక్ష పెట్టుబడి పెట్టి ఉంటే ఇప్పుడు అది రూ. 4కోట్లకు పెరిగి ఉండేది.
కంపెనీ వార్షిక ప్రాతిపదికన ఆదాయంలో 32.12శాతం వ్రుద్ధిని సాధించింది. ఈ త్రైమాసికంలో కంపెనీ రూ. 3.48కోట్ల నష్టాన్ని నివేదించింది. గతేడాది ఇదే కాలంలో రూ. 0.29 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. గత త్రైమాసికంతో పోల్చినట్లయితే వరుసగా 6.84 శాతం ఆదాయం తగ్గింది.
మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయంతోపాటుగా మరికొన్ని అంశాలు స్టాక్ మార్కెట్ మీద ప్రభావం చూపిస్తున్నట్లుగా క నిపిస్తోంది. ట్రంప్ కెనెడియన్, మెక్సికన్ ఉత్పత్తులపై 25శాతం దిగుమతి సుంకం, చైనా ఉత్పత్తులపై 10శాతం సుంకం విధిస్తామని ప్రకటించారు. దీని వల్ల అంతర్జాతీయ మార్కెట్లో ఒక రకమైన అనిశ్చితి ఏర్పడింది. అయితే తర్వాత ట్రంప్ మెక్సికో, కెనడా వంటి దేశాలపై ఒక నెలపాటు సుంకాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత మార్కెట్లు కోలుకుంటున్నట్లు కనిపిస్తున్నాయి.






