- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Mukesh Ambani: ఫోర్బ్స్ ఇండియా సంపన్నుల జాబితాలో ముఖేష్ అంబానీయే నంబర్ వన్
జాబితాలో అంబానీ 105 బిలియన్ డాలర్ల(రూ. 9.32 లక్షల కోట్ల)తో అగ్రస్థానాన్ని నిలుపుకున్నారు.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ అతిపెద్ద ప్రైవేట్ రంగ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ మరోసారి దేశంలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. తాజాగా ఫోర్బ్స్ ప్రకటించిన దేశంలోనే 100 మంది ధనవంతుల జాబితాలో అంబానీ 105 బిలియన్ డాలర్ల(రూ. 9.32 లక్షల కోట్ల)తో అగ్రస్థానాన్ని నిలుపుకున్నారు. అయితే, గతేడాదితో పోలిస్తే ముఖేష్ అంబానీ సంపద 12 శాతం క్షీణించడం గమనార్హం. అంబానీ తర్వాత 92 బిలియన్ డాలర్ల(రూ. 8.17 లక్షల కోట్ల)తో గౌతమ్ అదానీ రెండో అత్యంత సంపన్న వ్యక్తిగా ఉన్నారు. ఫోర్బ్స్ వివరాల ప్రకారం, ఈ వంద మంది భారతీయ సంపన్నుల సంపద విలువ ఈ ఏడాది 9 శాతం తగ్గి రూ. 89 లక్షల కోట్లకు చేరుకుంది. భారత కరెన్సీ రూపాయి బలహీనపడటం, భారత స్టాక్ మార్కెట్ల బెంచ్‌మార్క్ సూచీ సెన్సెక్స్ 3 శాతం మేర క్షీణించడం, అంతర్జాతీయంగా వాణిజ్య, ఆర్థిక అనిశ్చితుల కారణంగా దేశీయ కుబేరుల సంపదలో క్షీణత నమోదైంది. మొత్తం మీద, జాబితాలో ఉన్న వారిలో అంబానీతో సహా దాదాపు మూడింట రెండు వంతుల మంది ఈ ఏడాది సంపదలో క్షీణతను ఎదుర్కొన్నారు.
ఈ జాబితాలో ఓపీ జిందాల్ గ్రూప్‌నకు చెందిన సావిత్రి జిందాల్ మూడో స్థానం(రూ. 3.6 లక్షల కోట్లు)లో నిలవగా, ప్రైవేట్ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌కు చెందిన సునీల్ మిట్టల్(రూ. 3.03 లక్షల కోట్లు) నాలుగో స్థానంలో, హెచ్‌సీఎల్ టెక్‌కు చెందిన శివ్ నాడార్(రూ. 2.95 లక్షల కోట్లు) ఐదో స్థానంలో ఉన్నారు.






