- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
RIL: రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు రూ. 57 కోట్ల జీఎస్టీ నోటీసులు
by S Gopi |
అయితే, ఈ ఆర్డర్‌పై అప్పీలుకు వెళ్లాలని కంపెనీ భావిస్తోంది.

X
దిశ, బిజినెస్ బ్యూరో: ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు అహ్మదాబాద్ జీఎస్టీ కమిషనర్ కార్యాలయం రూ. 57 కోట్ల జరిమానా విధించింది. ఈ మేరకు రిలయన్స్ ఇండస్ట్రీస్(అర్ఐఎల్) గురువారం ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో పేర్కొంది. దీని ప్రకారం, 2017, జూలై 1 నుంచి 2018, జనవరి 24 మధ్య కాలంలో కంపెనీ నౌకలను అద్దెకు తీసుకునే సేవలను వర్గీకరించడంతో కంపెనీ తక్కువ పన్ను చెల్లించిందని జీఎస్టీ కమిషనర్ కార్యాలయం తన ఆర్డర్‌లో పేర్కొంది. అయితే, ఈ ఆర్డర్‌పై అప్పీలుకు వెళ్లాలని కంపెనీ భావిస్తోంది. ఈ ఆర్డర్ సాధారణ ప్రక్రియలో భాగంగానే వచ్చిందని, దీనివల్ల కంపెనీ రోజువారీ పనులు లేదా ఇతర వ్యాపార కార్యకలాపాలపై ప్రభావం చూపదని ఆర్ఐఎల్ స్పష్టం చేసింది. కాగా, గురువారం సాయంత్రం స్టాక్ మార్కెట్లు ముగిసే సమయానికి కంపెనీ షేర్ స్వల్పంగా క్షీణించి రూ. 1,510.60 వద్ద ముగిసింది.
Next Story






