Mukhesh Ambani: అమెరికాలో అత్యంత విలాసవంతమైన బిల్డింగ్ కొన్న ముఖేష్ అంబానీ

by S Gopi |

ట్రిబెకాలోని 11 హుబర్ట్ స్ట్రీట్‌లో ఉన్న భవనాన్ని 17.4 మిలియన్ డాలర్ల(రూ. 154 కోట్ల)కు కొనుగోలు చేశారు.

Mukhesh Ambani: అమెరికాలో అత్యంత విలాసవంతమైన బిల్డింగ్ కొన్న ముఖేష్ అంబానీ
X

దిశ, బిజినెస్ బ్యూరో: రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, బిలియనీర్ ముఖేష్ అంబానీ విదేశాల్లో భారీగా ఆస్తి కొనుగోలు చేస్తున్నారు. తాజాగా అమెరికాలోని న్యూయార్క్‌లో ట్రిబెకా పరిసరాల్లో అత్యంత విలాసవంతమైన భవనాన్ని కొనుగోలు చేసినట్లు సమాచారం. రియల్ డీల్ నివేదిక ప్రకారం, ట్రిబెకాలోని 11 హుబర్ట్ స్ట్రీట్‌లో ఉన్న భవనాన్ని 17.4 మిలియన్ డాలర్ల(రూ. 154 కోట్ల)కు కొనుగోలు చేశారు. అంతకుముందు 2023, ఆగస్టులో హడ్సన్ నదిని ఆనుకుని మాన్‌హట్టన్‌లోని వెస్ట్ విలేజ్‌లో ఉన్న డౌన్‌టౌన్‌లో 9 మిలియన్ డాలర్ల విలువైన రెండు బెడ్‌రూమ్‌ల కాండోను విక్రయించిన రెండేళ్లకే అంబానీ కొత్త బిల్డింగ్‌ను కొన్నారు. ఈ బిల్డింగ్‌ను 2018లో 20 మిలియన్ డాలర్లకు ప్రముఖ టెక్ బిలియనీర్ రాబర్ట్ పెరా కొన్నారు. దాన్ని లగ్జరీ నివాసంగా మార్చాలని భావించినప్పటికీ, ఫలించలేదు. దాంతో 2021లో దీన్ని 25 మిలియన్ డాలర్లకు అమ్మకానికి ఉంచారు. ముఖేష్ అంబానీ తాజాగా కొన్న ట్రిబెకా ప్రాంతంలోని భవనం 25 మిలియన్ డాలర్లకు లిస్ట్ చేసింది. ఈ ఆస్తి జీవితంలో ఒకసారి మాత్రమే లభించే అవకాశంగా పేర్కొంది. బ్లూమ్‌బర్గ్ బిలియనీర ఇండెక్స్ ప్రకారం.. 2025, సెప్టెంబర్ 1 నాటికి ముఖేష్ అంబానీ సంపద సుమారు 97.9 బిలియన్ డాలర్లు(రూ. 8.64 లక్షల కోట్లు) ఉంది. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యక్తుల్లో 18వ స్థానంలో ఉన్నారు.

Next Story